హాలీవుడ్ లెవెల్లో వరుణ్ తేజ్ లేటెస్ట్ సినిమా ప్రీటీజర్.!

టాలీవుడ్ లో అతి పెద్ద మార్కెట్ అండ్ ఫేమ్ ఉన్న ఫామిలీ లో మెగా ఫామిలీ కూడా ఒకటి. మరి మెగా కుటుంబం నుంచి అయితే హీరోలుగా వచ్చిన వారిలో కాస్త రొటీన్ కి భిన్నంగా కొత్త కథలు ఎంచుకునే హీరో ఎవరన్నా ఉన్నారు అంటే అది మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అని చెప్పాలి.

కాగా వరుణ్ తేజ్ కి ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి కి ఈ మధ్యనే ఎంగేజ్మెంట్ కూడా అవ్వగా ఇక వీటితో పాటుగా వారి తేజ్ నెక్స్ట్ మూవీ నుంచి ఇప్పుడు సాలిడ్ అప్డేట్ అయితే వచ్చింది. వరుణ్ తేజ్ ఇప్పుడు ప్రముఖ టాలెంటెడ్ దర్శకుడు ప్రవీణ్ సత్తారు తో భారీ ఏక్షన్ డ్రామా “గాండీవధారి అర్జున” అనే సినిమా చేస్తున్నాడు.

అయితే ఈ చిత్రం నుంచి ఇపుడు ప్రీ టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేయగా ఈ టీజర్ ఊహించని లెవెల్లో ఉందని చెప్పాలి. ప్రవీణ్ సత్తారు కంప్లీట్ హాలీవుడ్ లెవెల్ టేకింగ్ అయితే ఇందులో చూపించాడు. స్టార్టింగ్ లోనే వింటేజ్ కార్ పై చూపించిన రేసింగ్ షాట్స్ కానీ తర్వాత గన్స్ తో షాట్స్ కానీ హాలీవుడ్ లెవెల్లో కనిపిస్తున్నాయి.

దీనితో ఈ సినిమాపై ఆడియెన్స్ లో మెయిన్ గా ఏక్షన్ మూవీ లవర్స్ లో మంచి అటెన్షన్ అయితే దక్కవచ్చు. కాగా ఇది జస్ట్ ప్రీ టీజర్ మాత్రమే కాకుండా త్వరలోనే టీజర్ కూడా రానుంది. ఇక మరో విషయంలో ఈ విజువల్స్ కి తగ్గట్టుగా మిక్కీ జే మేయర్ ఇచ్చిన సంగీతం కూడా నెక్స్ట్ లెవెల్లో వచ్చింది.

మొత్తానికి అయితే ఏదో గట్టిగానే మేకర్స్ ప్లాన్ చేసినట్టు ఉన్నారు. ఇక ఈ సినిమాలో రీసెంట్ ఏజెంట్ తో టాలీవుడ్ లోకి వచ్చిన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుండగా విరూపాక్ష నిర్మాతలు నిర్మాణం వహిస్తున్నారు. 
Gandeevadhari Arjuna (Telugu) - Pre Teaser  | Varun Tej | Praveen Sattaru | Sakshi Vaidya | SVCC