మెగా ప్రిన్స్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం… ఇట్స్ అఫీషియల్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి నిశ్చితార్ధం ఈ నెల 9న జరగబోతోందని గత కొంతకాలంగా విపరీతంగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. ముందుగా ఈ న్యూస్ ని ఓ ఆంగ్ల వెబ్ సైట్ ప్రచారం చేసింది. అప్పటి నుంచి జోరుగా ఈ వార్తపై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే దీనిపై మెగా ఫ్యామిలీ కాని, అటు లావణ్య త్రిపాఠి నుంచి ఎలాంటి ఖండన రాలేదు.

దీంతో ఇది నిజమే అనే మాట ఫిల్మ్ నగర్ సర్కిల్ నుంచి కూడా బయటకి వచ్చింది. ఇదిలా ఉంటే మెగా ఫ్యామిలీకి సన్నిహితంగా ఉండే కొంత మంది మెగా అభిమానులు ఇప్పుడు ట్విట్టర్ లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ ని నిర్ధారిస్తూ పోస్టులు పెట్టారు. అవి కాస్తా వైరల్ అయ్యాయి. జూన్ 9న ఎంగేజ్మెంట్ జరగబోతోందని, ఇది అఫీషియల్ అంటూ డిక్లేర్ చేశారు.

అయితే అతికొద్ది మంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలోనే వీరిద్దరి నిశ్చితార్ధ వేడుక జరగబోతోందంట. ఇప్పటికే ఎంగేజ్మెంట్ కి సంబందించిన ఏర్పాట్లు కూడా జరిగినట్లు తెలుస్తోంది. నిశ్చితార్ధం అయిన తర్వాత ఫోటోలని బయటకి రిలీజ్ చేసే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తోంది. లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ కలిసి మిస్టర్, అంతరిక్షం సినిమాలలో కలిసి నటించారు.

అప్పుడే ఇద్దరి మధ్య స్నేహం కాస్తా ప్రేమగా మారిందని తెలుస్తోంది. గతంలోనే ఇద్దరి మధ్య రిలేషన్ ఉందనే ప్రచారం నడిచింది. అది ఇప్పుడు అఫీషియల్ గా కన్ఫర్మ్ అయ్యింది. పెళ్లి వేడుకని గ్రాండ్ గా చేయాలని అనుకుంటున్నారు. ఇక మ్యారేజ్ తర్వాత కూడా లావణ్య త్రిపాఠి ఎప్పటిలాగే నటిగా చేయనుందంట. తాజాగా ఆమె లీడ్ రోల్ లో ఒక వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. అలాగే సినిమాలు కూడా చేయడానికి సిద్ధంగా ఉందని టాక్.

అయితే వీలైనంత వరకు ఫిమేల్ సెంట్రిక్ కథలతోనే మూవీస్ చేయాలని లావణ్య త్రిపాఠి ప్లాన్ చేసుకుంటుందని ఇండస్ట్రీ వర్గాల మాట. ఇప్పుడు ఎలాగూ మెగా ఇంటి కోడలు అవుతుంది కాబట్టి ఆమె క్రేజ్ కూడా మెగా ఇమేజ్ తోడవుతుంది. దీంతో ఆమెతో బలమైన కంటెంట్ బేస్డ్ కథలు చేయడానికి దర్శక, నిర్మాతలు ముందుకొచ్చే ఛాన్స్ ఉంది.