Constable Song: టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ మధులిక వారణాసి కలిసి నటించిన చిత్రం కానిస్టేబుల్. ఆర్యన్ సుబాన్ ఎస్కే దర్శకత్వం వహించిన ఈ సినిమా జాగృతి మూవీ మేకర్స్ బ్యానర్ పై బలగం జగదీశ్ నిర్మాణంలో తెరకెక్కుతుంది. అయితే ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 10న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్, పలు సాంగ్స్ రిలీజ్ చేసారు మూవీ మేకర్స్.
ఇవి సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇది ఇలా ఉంటే తాజాగా కానిస్టేబుల్ సినిమా నుంచి ఒక ఐటమ్ సాంగ్ ని రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. ఈ ఐటమ్ సాంగ్ ను తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. భరత్ భూషణ్ సినిమా హిట్ అవ్వాలని మూవీ యూనిట్ కి అభినందనలు తెలిపారు. దావత్ అనే ఈ పాటను శ్రీనివాస్ తేజ రాయగా సుభాష్ ఆనంద్ సంగీత దర్శకత్వంలో గీతా మాధురి పాడింది.

ఈ పాటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ ఐటమ్ సాంగ్ విడుదల చేసిన సందర్భంగా హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఐటమ్ సాంగ్ కి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ గానే రెస్పాన్స్ వస్తోంది. యూట్యూబ్ లో కూడా ప్రస్తుతం ఈ పాట ట్రెండ్ అవుతోంది.
