వామ్మో .. ఆ బాలీవుడ్ హీరో బాలయ్యనే మించిపోయాడే !

balakrishna committed new movie with director b.gopal

సినిమా .. ఇందులో ఏదైనా సాధ్యమే. ఆకాశాన్ని కూడా భూమి మీదకి తీసుకురాగల శక్తి ఉన్నది సినిమాకి మాత్రమే. అయితే , ఆ సినిమాల్లో అప్పుడప్పుడు కొన్ని సీన్లు ప్రేక్షకుల సహనాన్ని పరిక్షిస్తాయి. ముఖ్యంగా లాజిక్ లేని కొన్ని సీన్లు ప్రేక్షకులను నవ్విస్తాయి. కొందరేమో ఇదేం తీయడం అంటూ లాజిక్ లు వెతికి ఆగ్రహం వ్యక్తం చేస్తారు. తెలుగులో ప్రముఖ హీరో బాలకృష్ణ చేసిన ఓ సినిమాలోని ట్రైన్ సీన్ ఇలా గతంలో ట్రోలింగ్​కు గురైంది.

రైలు వెనక్కి వెళ్లడం, వేగంగా వచ్చి రైలు బోగీని డీ కొట్టి ఆపేయడం లాంటి సీన్లను నెటిజన్లు విపరీతంగా ఆడేసుకున్నారు. సోషల్ మీడియాలో స్పూఫ్ లు కూడా వైరలయ్యాయి. ఇప్పుడు అదే విదంగా గతంలో బాలయ్య చేసినటువంటి వంటి ఫీటే బాలీవుడ్​ లోనూ దర్శనమిచ్చింది. కాకపోతే ఇది కొంచెం విభిన్నం కాగా.. దాన్ని మించిపోయిందంటూ కామెంట్లు వస్తున్నాయి.

1995లో విడుదలైన హిట్ సినిమా కూలీ నంబర్​ వన్ రీమేక్​ లో హీరో వరుణ్ ధావన్ నటించాడు. ఆ చిత్రంలోని ఓ సీన్ ఇప్పుడు హాట్ టాపిక్​గా మారింది. అది చూసిన వారి మతిపోగొడుతోంది. కదిలే ట్రైన్​ పై వేగంగా పరుగెత్తుకొచ్చే హీరో వరుణ్​.. ఒక్కసారిగా రైలు ముందుకు పట్టాలపై దూకి ముందున్న పాపను కాపాడుతాడు. ఇదెలా సాధ్యం అంటూ నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

https://twitter.com/NayabPokiri/status/1342179073674506240?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1342433167047684096%7Ctwgr%5E%7Ctwcon%5Es3_&ref_url=https%3A%2F%2Ftelugu.news18.com%2Fnews%2Ftrending%2Fvarun-dhawans-coolie-no-1-train-scene-has-netizens-baffled-krs-702236.html