వరుస హిట్ సినిమాలను అందుకున్న వరలక్ష్మి… భారీగా రెమ్యూనరేషన్ పెంచేసిన జయమ్మ?

వరలక్ష్మి శరత్ కుమార్ కోలీవుడ్ హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి ఈమె అనంతరం పలు సినిమాలలో విలన్ పాత్రలలో నటిస్తూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగులోకి క్రాక్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాలో జయమ్మ పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచారు. ఈ సినిమా మంచి హిట్ అవడంతో ఈమెకు తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి. ఇలా తెలుగులో విలన్ పాత్రలలో అవకాశాలు రావడంతో ఈమె కూడా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నారు.

ఇక యశోద వీరసింహారెడ్డి వంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ రెండు సినిమాల్లో కూడా అద్భుతమైన విజయాన్ని అందుకున్నాయి. ముఖ్యంగా వీర సింహారెడ్డి సినిమాలో ఈమె భాగమతి పాత్రలో నటించిసందడి చేశారు. ఈ సినిమాలో బాలకృష్ణకు చెల్లెలుగా నటించిన వరలక్ష్మి తన నటనతో అందరిని మెప్పించారు.ఇక ఈ సినిమా కూడా మంచి హిట్ అవడంతో ఈమెకు తెలుగు చిత్ర పరిశ్రమలో భారీగా డిమాండ్ పెరిగిపోయింది.

ఇలా వరలక్ష్మికి వరుస అవకాశాలు రావడంతో ఈమె కూడా రెమ్యూనరేషన్ భారీగా పెంచిందని సమాచారం ప్రస్తుతం ఒక్కో సినిమాకు ఈమె కోటి రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నారట హీరోలు బడా బ్యానర్ అయితే ఏకంగా కోటిన్నర వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం.ఇలా ఉన్నఫలంగా వరలక్ష్మి శరత్ కుమార్ ఒకేసారి ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ పెంచేయడంతో నిర్మాతలు ఒకింత షాక్ కి గురవుతున్నారు.ఇక ప్రస్తుతం ఈమే మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో కూడా నటిస్తున్నారు. ఈ సినిమా కూడా హిట్ అయితే వరలక్ష్మి కెరీర్ కు బ్రేకులు ఉండవని చెప్పాలి.