సీనియర్ నటుడు విజయ్ కుమార్, నటి మంజుల దంపతుల పెద్ద కూతురు వనిత. ఈమె చంద్రలేఖ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమయ్యారు. సినిమాలతో పెద్దగా గుర్తింపు రాలేదు. బిగ్ బాస్ తమిళం సీజన్ 3లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టి అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఈమె తన వర్క్ విషయాల కన్నా పర్సనల్ ఇష్యూస్‌తోనే ఎక్కువగా వార్తలలో నిలుస్తూ ఉంటుంది. నాలుగు సార్లు ప్రేమలో పడ్డ వనిత మూడు సార్లు పెళ్ళి చేసుకుంది. ఇప్పుడు ఐదో సారి ప్రేమలో పడ్డానంటూ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.
దేవి అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన వనిత.. 2000 సంవత్సరంలో నటుడు ఆకాశ్‌ను వివాహం చేసుకుంది. వీరి వైవాహిక జీవితానికి గుర్తుగా ముగ్గురు పిల్లలు(అబ్బాయి, కవల అమ్మాయిలు) ఉన్నారు. ఏడేళ్ల కాపురం తర్వాత 2007లో అతడితో విడాకులు తీసుకుంది. అనంతరం ఇదే సంవత్సరంలో జయ్ రాజన్ అనే వ్యాపార వేత్తను రెండో పెళ్ళి చేసుకుంది. అతనితో ఐదేళ్లు కాపురం చేసాక బ్రేకప్ చెప్పింది. డ్యాన్స్ మాస్టర్ రాబర్ట్‌తో నాలుగేళ్లు డేటింగ్‌లో ఉంది. 2017లో అతని నుండి విడిపోయింది. . గత జూన్‌లో పీటర్ పాల్ అనే వ్యక్తిని మూడో వివాహం చేసుకుంది. పీటర్ పాల్ మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే వనిత విజయ్ కుమార్‌ను రెండో పెళ్లి చేసుకోవడంతో ఈ పెళ్లి కాస్త వివాదంగా మారింది.
అయితే పీటర్ పాల్ ఎక్కువగా మద్యం మత్తులో ఉంటాడని చెప్పుకొచ్చిన వనిత అతనికి విడాకులు ఇచ్చేసింది. వనిత పర్సనల్ లైఫ్ చూస్తే ఎక్కువగా కాంట్రవర్సీస్‌తోనే నిండి ఉంది. ఈమె జీవితంలో 4 సార్లు ప్రేమ..3 సార్లు పెళ్లి జరిగగా, ఇప్పుడు ఐదోసారి ప్రేమలో పడతానని చెప్పడంతో నెటిజన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. ప్రేమ పక్షిలా ఇంకెన్నాళ్ళు ప్రేమ కోసం పాకులాడతావు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇంతకు ఐదో సారి ఎవరి ప్రేమలో పడిందనే విషయంపై ఇంత వరకు క్లారిటీ ఇవ్వలేదు