మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఈ పేరుకి పరిచయం అక్కర్లేదు. అతడు రావడానికి మెగా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో వచ్చినా తన తొలి సినిమాతో తన ప్రతిభను చూపించారు. మెగా మేనల్లుడు వైష్ణవ్‌తేజ్, అందాల భామ కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయం అయిన చిత్రం ‘ఉప్పెన’. ఫిబ్రవరి 12న విడుదలైన ఈ సినిమా బాక్సాపీస్ వద్ద ఇప్పటికీ దూసుకుపోతోంది. ఈ సినిమా ఇప్పటికే రూ.100కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి రికార్డులను తిరగరాసింది. సినిమా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ను లాభాల్లో ముంచెత్తింది.
కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ తర్వాత విడుదలైన చిత్రాల్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగానూ నిలిచింది. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా నటించిన సినిమా ఉప్పెన ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. అయితే ఉప్పెన తర్వాత వీరిద్దరు తమతమ సినిమాలతో బిజీ అయిపోయారు. వైష్ణవ్ తన తదుపరి సినిమాని క్రిష్ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు.
ఈ సినిమా పేరు ఇంకా ఫిక్స్ కాకపోయినప్పటికీ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ సినిమా తర్వాత వైష్ణవ్ అక్కినేని నాగార్జున నిర్మాతగా అన్నపూర్ణ ప్రొడక్షన్‌లో తన తదుపరి సినిమాను చేయనున్నారంట. ఇప్పుడు తాజాగా వైష్ణవ్ మరో స్టార్ నిర్మాతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంట. బీవీఎస్ఎన్ ప్రసాద్ ప్రొడక్షన్‌లో సినిమాకు వైష్ణవ్‌కు అడ్వాన్స్‌కు ఇచ్చారని టాక్ వస్తోంది. ఈ సినిమాకు కథ ఇంకా ఫైనల్ కాలేదంట. ఇంతవరకు ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన చేస్తారని టాక్ వస్తోంది. ఆ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నాడని ప్రచారం జరుగుతుంది. ఇలా వరుస సినిమాలతో ఈ మెగా హీరో ఫుల్ బిజీగా మారిపోయాడు.