కోట్ల కుమ్మరించి కొత్త కారు కొన్న మెగా కోడలు.. వైరల్ వీడియో..!

మెగాస్టార్ చిరంజీవి కోడలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కామినేని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె ఒక స్టార్ హీరోకి భార్య మాత్రమే కాదు భారతదేశంలో ప్రతిష్టాత్మకమైన అపోలో హాస్పిటల్స్ కి వైస్ చైర్ పర్సన్. ఉపాసన ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఈ సోషల్ మీడియా ద్వారా ఉపాసన ఎన్నో మంచి విషయాలను షేర్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఉపాసన ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ..అపోలో హాస్పిటల్ ద్వారా ఎంతో మందికి ఉచితంగా వైద్య సేవలు కూడా అందిస్తోంది. సహజంగా జంతు ప్రేమికురాలు అయిన ఉపాసన జంతువుల సంరక్షణ కోసం కోసం ఎంతో కృషి చేస్తున్నారు.

ఉపాసన చేసే సేవా కార్యక్రమాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు పొందింది . ఇదిలా ఉండగా ఉపాసన ఇటీవల ఒక కొత్త కారు కొనుగోలు చేసింది. ఈ కారు కోసం ఉపాసన కోట్ల రూపాయలు వెచ్చించినట్టు తెలుస్తోంది. సాధారణంగా సెలబ్రిటీలు ఎప్పుడు కాస్ట్లీ వస్తువులను వినియోగిస్తూ ఉంటారు. వారు తినే ఆహారం దగ్గరినుండి ధరించే దుస్తులు వాడే వస్తువులు తిరిగే కార్లు అన్ని ఖరీదైనవే ఉపయోగిస్తూ ఉంటారు. ఇటీవల ఉపాసన కూడా ఒక ఖరీదైన కారు కోనుగోలు చేసింది. కోట్లు విలవ చేసే ఆడి కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ కారుని కోనుగోలు చేసింది.

ప్రస్తుతం ఉపాసన కొన్న ఈ కారు విలువ దాదాపు 1.66 కోట్ల ఉన్నట్లు సమాచారం. ఉపాసన ఈ కారులో విహరిస్తూ కారు ప్రత్యేకతలను వివరించింది. ఉపాసన కొత్త కారుకి సంబందించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్ట వైరల్ గా మారింది. ఉపాసన ఈ వీడియో షేర్ చేస్తూ .. ప్రపంచంలో ప్రతిదీ అప్‌గ్రేడ్ అవుతోంది. అందుకనుగుణంగా నేను కూడా అప్‌గ్రేడ్ అయ్యాను. ఈ క్రమంలోనే తాజాగా ఆడి ఇ-ట్రాన్‌ను కొనుగోలు చేశానని ఉపాసన తెలిపారు. అంతేకాకుండా నేను ఈ కారులో ఎంతో సౌకర్యవంతంగా ప్రయాణం చేయగలుగుతున్నాను. నా అన్ని అవసరాలకు ఈ కారు చాలా అనువుగా ఉందని ఉపాసన తెలియచేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.