సక్సెస్, ఫెయిల్యూర్‌కి అతీతంగా ఆ బ్యూటీకి ఛాన్సులొస్తున్నాయ్. కానీ, ఫిజిక్ మెయిన్‌టెయిన్ చేయడంలో ఇబ్బందులు పడుతోందామె.! స్ట్రిక్ట్ డైట్ కూడా ఆమె బొద్దుతనాన్ని నాజూగ్గా మార్చలేకపోతోందిట. దాంతో, విదేశాలకు వెళ్ళి ఒళ్ళు తగ్గించుకోవాలని ఆమెకు ఓ దర్శకుడు ఇటీవల సూచన చేశాడట. సదరు దర్శకుడి సినిమాలో ఇటీవల ఆమె నటించింది కూడా.
తన కొత్త సినిమాలో ఆమెకు ఓ హీరోయిన్‌గా ఛాన్స్ ఇద్దామనుకున్నా, ఆ పర్సనాలిటీ వల్లనే, ఆమెకు ఆ ఛాన్స్ లేకుండా పోయిందట. ఈ విషయమై సదరు సినిమా హీరోకీ, ఆ దర్శకుడికీ మధ్య అభిప్రాయ బేధాలొచ్చాయనీ చెబుతున్నారు.
ఇక ఇలా కాదనుకుని, విదేశాలకు ఒళ్ళు తగ్గించుకునేందుకోసం వెళ్ళే ఆలోచన చేస్తోందిట సదరు హీరోయిన్.