రేపు నందమూరి బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా ఆల్రెడీ సంబరాలు సోషల్ మీడియాలో మొదలు కావుగా తన కెరీర్ లో 107వ సినిమాగా తీస్తున్న భారీ చిత్రం నుంచి సాలిడ్ మాస్ టీజర్ ఈరోజు రానుంది. అయితే ఈ టీజర్ విషయం పక్కన పెడితే బాలయ్య బాబు దర్శకుడు గోపీచంద్ మలినేనితో సినిమా తర్వాత హిట్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో కంప్లీట్ గా ఒక కొత్త సినిమాను చేయనున్నారు.
ఇది అనిల్ రొటీన్ ప్లాట్ కామెడీకి భిన్నంగా పూర్తిగా బాలయ్య శైలిలో అదిరే ఏక్షన్ తో ఉంటుంది అని కన్ఫర్మ్ చేసాడు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి ఇప్పుడు ఫిక్స్ చేసిన టైటిల్ అంటూ ఒక ఊహించని టైటిల్ మంచి వైరల్ గా మారిపోయింది. ఇంతకీ ఈ సినిమాకి ఏమని టైటిల్ పెట్టారో తెలుసా? “బ్రో ఐ డోంట్ కేర్” అట. ఏంటి ఇది బాలయ్య సినిమాకేనా అంటే అవును నిజమే అని ఇండస్ట్రీ వర్గాలు వారు అంటున్నారు.
చాలా వరకు ఈ టైటిల్ నే ఫిక్స్ చేసారు అంటూ గట్టి టాక్ వినిపిస్తుండగా దీనిపై అయితే అధికారిక క్లారిటీ కూడా వస్తుందని వినికిడి. మొత్తానికి అయితే బాలయ్య రోజు రోజుకి మరింత స్టైలిష్ గా యూత్ కి కనెక్ట్ అయ్యేలా మారిపోతున్నాడని చెప్పాలి. అయితే ఈ అప్డేట్ రేపు బాలయ్య బర్త్ డే కానుకగా ఏమన్నా వస్తుందేమో చూడాలి.