Thalapathy Vijay: విజయ్ ఆఖరి సినిమాకు ఊహించని డీల్.. సెట్టయితే రికార్డే..

ఇళయదళపతి విజయ్‌ నటిస్తున్న తాజా సినిమా జననాయకన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. రాజకీయాల్లోకి అడుగుపెట్టబోయే ముందు విజయ్ చేస్తోన్న ఈ చిత్రం, అభిమానులకే కాదు, ట్రేడ్ వర్గాలకు కూడా బిగ్ ఎగ్జైట్‌మెంట్ కలిగిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ, శాటిలైట్ హక్కుల డీల్ ఇప్పటికే సత్తా చాటింది. మొత్తం రూ.170 కోట్లకు పైగా ఒక ప్రముఖ సంస్థ రైట్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం.

ఈ సినిమా పొలిటికల్ టచ్‌తో కూడిన మాస్ డ్రామా కావడం, అలాగే విజయ్ చివరి సినిమా అన్న హైప్ తో హక్కుల ధరలు ఆకాశాన్ని అంటాయి. తమిళ భాషలో మాత్రమే ఈ డీల్ ఫిక్స్ అయ్యిందన్న టాక్ కూడా ఉంది. ఈ డీల్‌లో డిజిటల్, శాటిలైట్, ఆడియో, డబ్బింగ్ రైట్స్ అన్నీ ఉన్నాయని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. ఇది విజయ్ కెరీర్‌లోనే కాదు, మొత్తం తమిళ పరిశ్రమలోనే అరుదైన డీల్‌గా నిలిచే అవకాశముంది.

దర్శకుడు హెచ్ వినోత్ ఈ సినిమాకు కథను తనదైన స్టైల్‌లో మలచినట్టు సమాచారం. బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి ఆధారంగా కొన్ని మూల అంశాలు తీసుకున్నప్పటికీ, కథలో మార్పులు చేసి విజయ్ ఇమేజ్‌కి తగ్గట్టుగా తీర్చిదిద్దుతున్నారట. హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తుండటం కూడా సినిమాకు అదనపు అట్రాక్షన్ అయింది. పాటలు, ట్రైలర్ లాంటి ప్రోమోషన్లలో కూడా భారీ స్థాయిలో ఇన్వెస్ట్ చేయనున్నారు.

2026 జనవరి లేదా రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేయాలన్న యోచనలో ఉన్న ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్‌కి కూడా రెడీ అవుతోందని టాక్. ఈ సినిమా విజయ్‌కు రాజకీయ ఎంట్రీకు ముందు చివరి సినిమాగా ఉండటంతో, దీనిపై అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. కేవలం ఓటీటీ, శాటిలైట్ హక్కుల రూపంలో రూ.170 కోట్లకు పైగా రాబట్టిన జననాయకన్, థియేటర్ విడుదల తర్వాత ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.

HCU భూములు చరిత్ర || HCU issues And Solutions Exposed By Political Analyst KS Prasad || TeluguRajyam