ఉదయ్ కిరణ్ కాళ్లు పట్టుకొని క్షమాపణలు అడగబోయారు… తేజ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న తేజ ఎంతో మంది హీరోలకు లైఫ్ ఇచ్చారని చెప్పాలి ఇలా తేజా లైఫ్ ఇచ్చిన వారిలో ఉదయ్ కిరణ్ ఒకరు.ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఉదయ్ కిరణ్ కు చిత్రం సినిమాలో అవకాశం కల్పించి హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇలా ఈయన హీరోగా ఇండస్ట్రీలో ఎంతో అద్భుతమైన విజయాలను అందుకొని అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయారు. అయితే కొన్ని కారణాల వల్ల ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి డైరెక్టర్ తేజ ఉదయ్ కిరణ్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఉదయ్ కిరణ్ వరుస సినిమాలతో స్టార్ హీరోగా మారిపోయారు అయితే ఆయన ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న సమయంలో నేను తనకు ఫోన్ చేసినా కానీ తను ఫోన్ ఎత్తే పరిస్థితులలో లేరని, ఆ సమయంలో తనకు చాలా కోపం వచ్చిందని తేజ వెల్లడించారు.అయితే క్రమంగా ఆయన కెరియర్ డౌన్ ఫాల్ అయినప్పుడు తిరిగి తనకు ఔవునన్నా కాదన్న సినిమాలో అవకాశం కల్పించానని తేజ వెల్లడించారు.

ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా ఒకరోజు ఉదయ్ కిరణ్ తన వద్దకు వచ్చి మీరు ఫోన్ చేసిన నేను లిఫ్ట్ చేయలేదు నేను చేసిన తప్పుకి మీ కాళ్లు పట్టుకుంటా నన్ను క్షమించండి అంటూ కాళ్లు పట్టుకోవడానికి వచ్చారు. నువ్విలా నా కాళ్లు పట్టుకుంటే నేను నిన్ను క్షమించనని, ఇలా ఒకసారి నిన్ను క్షమిస్తే నీకు మరో తప్పు చేసే అవకాశం కల్పించిన వాడిని అవుతా.. నీకు మరో అవకాశం ఇవ్వను.నువ్వు నీలాగే ఉండు నేను నాలాగే ఉంటా ఇద్దరం కలిసి మంచి సినిమా చేసి హిట్టు కొడదాం అంటూ తనతో చెప్పానని ఈ సందర్భంగా తేజ ఉదయ్ కిరణ్ గురించి చెప్పినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.