అక్కినేని నాగచైతన్య సతీమణిగా అన్నపూర్ణా స్టూడియోస్ వ్యవహారాల్ని సమంత అప్పట్లో చక్కబెట్టినట్లు ప్రచారం జరిగింది. ఆ బాధ్యతల్ని ఆమెకు అప్పట్లో నాగార్జున అప్పగించేశారన్న వార్తలూ వచ్చాయి.
కానీ, నాగచైతన్యతో విడాకుల అనంతరం.. సమంతకీ ఆ అన్నపూర్ణా స్టూడియోస్‌కీ సంబంధాల్లేకుండా పోయాయి. కానీ, సినీ నిర్మాణంలో సమంత అనుభవాన్నైతే కొంత మేర సంపాదించిందట.
అనారోగ్య సమస్యలతో నటన నుంచి కొంత విరామం తీసుకున్న సమంత, తిరిగి ‘ఐ యామ్ బ్యాక్’ అంటోంది.! ఓ వైపు యాక్టింగ్, ఇంకో వైపు నిర్మాణం.. ఇలా ద్విపాత్రాభినయం చేయబోతోందట సమంత ఇకపై.
అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, సమంత తన సొంత బ్యానర్‌ని త్వరలో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. బ్యానర్ పేరు కూడా ఇప్పటికే ఫైనలైజ్ అయిపోయిందట.
విలక్షణమైన చిత్రాలు నిర్మించేందుకు ఆ కొత్త బ్యానర్ ఓ మంచి వేదిక అవుతుందని సమంత భావిస్తోందనీ, సమంతకి అత్యంత సన్నిహితులైన ఒకరిద్దరు సినీ ప్రముఖులు ఆమెతో సినీ నిర్మాణంలో చేతులు కలుపుతారనీ అంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.