“టైగర్ నాగేశ్వరరావు”కి రెండు షాకింగ్ రన్ టైమ్స్ వైరల్..!

ఇప్పుడు తెలుగు సినిమా నుంచి భారీ అంచనాలు నడుమ రాబోతున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా చిత్రం “టైగర్ నాగేశ్వరరావు” కోసం అందరికీ తెలిసిందే. మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన ఈ బిగ్గెస్ట్ చిత్రాన్ని కొత్త దర్శకుడు వంశీ తెరకెక్కించాడు. కాగా ఈ చిత్రం ఇప్పుడు దసరా కానుకగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుండగా.. 

రీసెంట్ గా అయితే ఈ సినిమాకి సంబంధించి ఓ షాకింగ్ అప్డేట్ వైరల్ గా మారింది. ఈ చిత్రానికి అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన ఏ సినిమాకి కూడా రాని భారీ రన్ టైం వచ్చిందని తెలుస్తుంది. ఇంకా సెన్సార్ సర్టిఫికెట్ రాలేదు కానీ ఈ చిత్రం ఏకంగా 3 గంటల ఒక్క నిమిషం రన్ టైం వచ్చినట్టుగా సినీ వర్గాల్లో సమాచారం వైరల్ గా మారింది.

కాగా ఈ చిత్రం విషయంలో ఓవర్సీస్ విషయానికి వస్తే ఇంకో రన్ టైం వైరల్ అవుతుంది. కాగా అది భారీ రన్ టైం అయితే ఇది చాలా తక్కువ రన్ టైం గా వచ్చింది అని చెప్పాలి. ఇది కేవలం 2 గంటలు మాత్రమే వచ్చింది. దీనితో టైగర్ నాగేశ్వరరావు కి ఈ రెండు కూడా వైరల్ గా మారుతున్నాయి.

అయితే ఈ భారీ చిత్రం పాన్ ఇండియా వైడ్ గా అన్ని భాషలతో పాటుగా సైన్ లాంగ్వేజ్ లో కూడా రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ వెర్షన్ కి సంబంధించి అది అయ్యి ఉండొచ్చు. మరి దీనిపై అసలు డీటెయిల్స్ రావాల్సి ఉంది. కానీ ఈ చిత్రం ఇండియా వెర్షన్ అయితే మూడు గంటలే అన్నట్టుగా అని చెప్పుకోవాలి. మొత్తానికి అయితే టైగర్ నాగేశ్వరరావు ఎలా ఉండబోతుంది అని చెప్పాలి.