ఇన్సైడ్ టాక్ : రవితేజ – మలినేని ప్రాజెక్ట్ ఆగిపోడానికి కారణం

టాలీవుడ్ సినిమా దగ్గర ఉన్న కొన్ని క్రేజీ కాంబినేషన్ లలో మాస్ మహరః రవితేజ మరియు రీసెంట్ గా వీరసింహా రెడ్డి క్రాక్ చిత్రాలతో మంచి హిట్స్ అందించిన దర్శకుడు గోపీచంద్ మలినేని ల కాంబినేషన్ కూడా ఒకటి. మరి ఈ కాంబినేషన్ లో అయితే హ్యాట్రిక్ విజయాలు అనంతరం చేస్తున్న నాలుగో సినిమాగా ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ తో సినిమా అనౌన్స్ చేయడంతో మంచి హైప్ వచ్చింది.

కానీ అనూహ్యంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఆగిపోయింది అనే వార్తలు స్టార్ట్ అయ్యాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అంటే ఆ సినిమా ఖచ్చితంగా ఆగిపోయిందట. కాగా ఇందుకు కారణాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ సినిమా ఆగిపోడానికి కొన్ని నాన్ థియేట్రికల్ డీల్ కి సంబంధించి లావాదేవీల విషయంలో ప్రొడక్షన్ హౌస్ కి ఓటిటి సంస్థలకి జరిగిన చర్చల్లో పొంతన కుదరక సినిమా నిలిచిపోయినట్టు తెలుస్తుంది.

ఇంకా చెప్పాలంటే ఈ సినిమా విషయంలో ఓటిటి వారు అంత ఆసక్తిగా లేరని అందుకే సినిమా ఆపేశారని కూడా కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు బిజినెస్ లో ఓటిటి రైట్స్ కూడా చాలా పాత్ర పోషిస్తున్నాయి. నిజానికి ప్రొడ్యూసర్స్ లు సినిమాలు చేస్తుంది థియేట్రికల్ బిజినెస్ కన్నా ఇలా నాన్ థియేట్రికల్ బిజినెస్ తోనే చాలా సేవ్ అయిపోతున్నారు. కానీ ఇక్కడే ఈ సినిమాకి దెబ్బ కొట్టడంతో ఈ క్రేజీ కాంబినేషన్ ఆగిపోయింది అని సినీ వర్గాల్లో వినిపిస్తున్న అంతర్గత సమాచారం..