టీజర్ టాక్ : రవితేజ “ఈగిల్” నుంచి ఇది ఊహించలేదే..!

టాలీవుడ్ సినిమా నుంచి వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ కి సిద్ధంగా ఉన్న పలు భారీ చిత్రాల్లో మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న చిత్రం “ఈగిల్” కూడా ఒకటి. ఇప్పటికే రవితేజ నటించిన చిత్రం “టైగర్ నాగేశ్వరరావు” తో ఆల్రెడీ తన కెరీర్ లో ఒక బిగ్గెస్ట్ అండ్ కొత్త మేకోవర్ ని చేసిన సంగతి తెలిసిందే.

అయితే చాలా మంది ఈ సినిమా తర్వాత ఈగిల్ ని కాస్త తక్కువ అంచనానే వేసి ఉండొచ్చు. కానీ ఈరోజు టీజర్ టీజర్ చూసాక మాత్రం ఖచ్చితంగా ఆ ఆలోచన నుంచి బయటకి రావాలి. ఎందుకంటే ఆ లెవెల్లో ఈ టీజర్ ఉంది. మెయిన్ గా రవితేజ ఊహించని మేకోవర్ ఆశ్చర్యపరచగా టీజర్ లో కంటెంట్ కూడా అంతే హై లో ఉంది.

దీనితో ఈ సంక్రాంతికి మాత్రం రవితేజ చాలా గట్టి పోటీ ఇవ్వనున్నాడు అని చెప్పాలి. ఇక ఇందులో ఎలివేషన్లు కానీ కలర్ గ్రేడింగ్ ఏక్షన్ సీక్వెన్స్ లు అవీ చూస్తుంటే ఈ సినిమా కూడా డెఫినెట్ గా స్యూర్ షాట్ హిట్ లా అనిపిస్తుంది. కాగా ఈ చిత్రాన్ని కార్తీక్ ఘట్టమనేని అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తుండగా..

అనుపమ పరమేశ్వరన్ ఇందులో కీలక పాత్ర చేస్తున్నట్టుగా టీజర్ చూస్తే అర్ధం అవుతుంది. ఇక రవితేజ మాస్ అవతార్ అయితే బిగ్గెస్ట్ హైలైట్ కాగా డెఫినెట్ గా టీజర్ చూసినవాళ్లు మాత్రం నెవర్ బిఫోర్ లాగా రవితేజ నుంచి దీనిని ఫీల్ అవ్వొచ్చు. 
EAGLE Teaser | Ravi Teja | Anupama Parameswaran | Karthik Gattamneni | People Media Factory