ఈ 4 భాషల్లో “టైగర్ నాగేశ్వరరావు” ఓటిటి షాకింగ్ ఎంట్రీ 

ఈ ఏడాది పండుగల కానుకగా తెలుగు స్టేట్స్ లో అయితే చాలానే సినిమాలు వచ్చాయి. అలా రీసెంట్ గా వచ్చిన చిత్రాల్లో అయితే దసరా కానుకగా టాలీవుడ్ లో వచ్చిన చిత్రాల్లో మాస్ మహారాజ రవితేజ హీరోగా దర్శకుడు వంశీ కాంబినేషన్ లో తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం “టైగర్ నాగేశ్వరరావు” కూడా ఒకటి.

స్టూవర్టుపురం గజదొంగ గరిక నాగేశ్వరరావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఒకే అనిపించింది. కానీ ఇపుడు ఈ చిత్రం అనుకోని విధంగా ఓటిటి లో దర్శనం ఇవ్వడం అందరికీ షాకింగ్ గా మారింది. కనీసం ఒక్క అలర్ట్ కూడా లేకుండా స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ కి తీసుకొచ్చేసారు.

కాగా ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో ఒక్క హిందీ  మినహా మిగతా భాషల్లో వచ్చేసింది. తెలుగు సహా తమిళ్ కన్నడ మలయాళ భాషల్లో ఈ చిత్రం ఇప్పుడు అందుబాటులో ఉంది. మరి తెలుగు వారు అయితే ఈ సినిమా ఇప్పుడు చూడొచ్చు.

అయితే హిందీ రిలీజ్ మాత్రం మరికాస్త ఆలస్యం కానున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నుపుర్ సనన్ నటించగా ఆమె ఈ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అలాగే గాయత్రీ భరద్వాజ్ అనే మరో హీరోయిన్ కూడా టాలీవుడ్ కి ఈ సినిమాతోనే పరిచయం అయ్యింది. 
https://x.com/PrimeVideoIN/status/1725446262345122035?s=20