ట్విట్టర్ రివ్యూ : “టైగర్ నాగేశ్వరరావు” పరిస్థితి ఏంటి?

టాలీవుడ్ సినిమా దగ్గర లేటెస్ట్ గా భారీ అంచనాలు ఉన్న చిత్రాల్లో దర్శకుడు వంశీ తెరకెక్కించిన మాసివ్ చిత్రాల్లో మాస్ మహారాజ రవితేజ హీరోగా బాలీవుడ్ బ్యూటీ నుపుర్ సనన్ హీరోయిన్ గా ఆమెతో పాటుగా గాయత్రీ భరద్వాజ్ కూడా నటించిన ఆ సినిమానే “టైగర్ నాగేశ్వరరావు” కూడా ఒకటి.

కాగా ఈ చిత్రం దసరా కానుకగా రిలీజ్ చేయగా ఈ చిత్రం రవితేజ కెరీర్ లోనే గ్రాండ్ అండ్ బిగ్గెస్ట్ మ్యానర్ లో అయితే రిలీజ్ చేయగా యూఎస్ లో ఈ చిత్రం ప్రీమియర్స్ ఆల్రెడీ పడ్డాయి. మరి ఈ చిత్రానికి అక్కడ నుంచి రిపోర్ట్స్ ఆల్రెడీ ట్విట్టర్ లో వచ్చేసాయి. దీనితో టైగర్ నాగేశ్వరరావు కి ఆడియెన్స్ కాస్త పాజిటివ్ రిపోర్ట్స్ నే అందిస్తున్నారు.

సినిమా బాగానే ఉందని మెయిన్ గా రవితేజ సినిమాలో సాలిడ్ హైలైట్ కాగా తన రోల్ లో ఓ రేంజ్ లో తాను ఫుల్ చేయడంతో ఎగ్జైట్ అవుతున్నారు. అలాగే కొన్ని సీన్స్ మరింత ఎగ్జైటింగ్ గా ఉండగా సినిమా మాత్రం అక్కడక్కడా కొంచెం స్లో గా ఉందని అంటున్నారు. ఇక హీరోయిన్స్ లో నుపుర్ మరియు గాయత్రీ లు కూడా తమ రోల్స్ లో బాగున్నారని అంటున్నారు.

అయితే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ఇప్పటికే రెండు భారీ సినిమాలు ఉన్నాయి కానీ వాటిని తట్టుకొని టైగర్ నాగేశ్వరరావు నిలబడుతుందా లేదా అనేది ఆసక్తిగా మారింది. దీనితో ఈ చిత్రం హిట్ స్టేటస్ లోకి వస్తుందో లేదో అనేది మాత్రం వసూళ్ల పరంగా చూడాల్సిందే. ఇంకా ఈ చిత్రానికి జివి ప్రకాష్ సంగీతం అందించగా అభిషేక్ అగర్వాల్ నిర్మాణం వహించారు. 
https://x.com/RavikumarJSP/status/1715190588910551306?s=20
https://x.com/NagaGuravaiah/status/1715190028081459641?s=20
https://x.com/TEJA_NAIDU1/status/1715189896309285019?s=20