సంక్రాంతి సినిమాలన్నీ ఫర్లేదు, బావుంది, చాలా బావుంది, సూపర్ హిట్ అనే టాక్ తెచ్చుకున్నాయ్. ‘గుంటూరు కారం’ ఫర్లేదు, వసూళ్ళ పరంగా ఓకే. ‘సైంధవ్’ బావుంది. ‘నా సామి రంగ’ చాలా బావుంది. ‘హనుమాన్’ సూపర్ హిట్.! ఇదీ నడుస్తున్న టాక్.
అయితే, థియేటర్ల పరంగా తొలుత ఇబ్బంది పడ్డ సినిమా ‘హనుమాన్’, ఆ తర్వాత మాత్రం, అనూహ్యంగా థియేటర్లను ఆక్రమించేస్తోంది. అది ఆ సినిమా సాధించి విజయం వల్లనే.!
‘సైంధవ్’ సినిమాకే కష్టమొచ్చిపడింది. ఈ సినిమా నలిగిపోతోందనడం కరెక్ట్. ఈ విషయమై విక్టరీ వెంకటేష్ సీరియస్ అయ్యాడట. మేకర్స్ కూడా ఏమీ చేయలేని పరిస్థితి. సినిమా బావున్నా ఈ పరిస్థితి ఎందుకు వస్తోందంటూ ఆరా తీస్తున్నాడట వెంకటేష్.
వెంకటేష్ సోదరుడు దగ్గుబాటి సురేష్ కూడా జరుగుతున్న వ్యవహారంపై కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. ‘నా సామి రంగ’ సినిమాకి పెద్దగా థియేటర్ల సమస్య లేదుగానీ, నాగ్ కూడా హ్యాపీగా లేడట.
‘గుంటూరు కారం’ సినిమా మీదనే ఇప్పుడంతా కారాలూ మిరియాలూ నూరేస్తున్నారు.