ట్విట్టర్ రివ్యూ : రవితేజ “రావణాసుర” పరిస్థితి ఏంటి?

మాస్ మహారాజ రవితేజ ఆల్రెడీ రెండు భారీ హిట్స్ ని కేవలం ఈ మూడు నాలుగు నెలల వ్యవధిలోనే కొట్టేసాడు. దీనితో హ్యాట్రిక్ కొట్టాలన్న ఉద్దేశంతో మూడో రిలీజ్ తో అయితే అప్పుడే వచ్చేసారు. “ధమాకా”, “వాల్తేరు వీరయ్య” సక్సెస్ ల తర్వాత దర్శకుడు సుధీర్ వర్మతో చేసిన ఆ కొత్త ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ సినిమానే “రావణాసుర”.

మొదటి నుంచి కూడా ఈ సినిమాపై మంచి హైప్ అయితే ఉంది. కాగా ఈ సినిమా అయితే ఎట్టకేలకు ఈరోజు రిలీజ్ కాగా ఈ సాలిడ్ ప్రాజెక్ట్ ఎలాంటి స్పందన అందుకుందో ఆల్రెడీ ప్రీమియర్స్ నుంచి ట్విట్టర్ లో వచ్చేస్తుంది. అయితే ఈ సినిమాకి ఆల్ మోస్ట్ మిక్సిడ్ రివ్యూస్ వినిపిస్తున్నాయి.

కాన్సెప్ట్ బాగా ఎంగేజింగ్ గా ఉంది కానీ స్క్రీన్ ప్లే ఇంకా బాగా తీసి ఉంటే బాగుండు అనేది చాలా మంది అంటున్నారు. కానీ సినిమాలో ట్విస్ట్ లు గాని ముఖ్యంగా రవితేజ నెగిటివ్ షేడ్ పెర్ఫామెన్స్ లు మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయని మూవీ లవర్స్ అంటున్నారు.

అలాగే అర్జున్ రెడ్డి ఫేమ్ సంగీత దర్శకుడు హర్ష వర్ధన్ రామేశ్వర్ ఇచ్చిన సంగీతం కూడా సినిమాలో అదిరిపోయినట్టుగా అంటున్నారు. ఫస్టాఫ్ అంతా క్రేజీ గా ఉంది కానీ సెకండాఫ్ కూడా ఇదే రేంజ్ లో ఉండి ఉంటే బాగుండేది అంటున్నారు కానీ మరికొందరు అయితే సినిమా అంతా సూపర్బ్ గా థ్రిల్లింగ్ గా ఉంది అంటున్నారు. దీనితో అయితే కాస్త అటు ఇటుగా సమాన టాక్ వినిపిస్తుంది. ఇక ఓవరాల్ గా రవితేజ ఎలాంటి రిజల్ట్ తో ఆగుతాడో చూడాలి. 
https://twitter.com/RahulReddy_03/status/1644150667458629633?s=20