ట్విట్టర్ రివ్యూ : “హిట్ 2” అంచనాలు అందుకునేలా ఉందా??

ఈ  ఏడాది టాలీవుడ్ నుంచి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో మంచి అంచనాలు హైప్ క్రియేట్ చేసి వచ్చిన చిత్ర “హిట్ 2 కూడా ఒకటి. మరి అడివి శేష్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని గత “హిట్ 1” సినిమాని దర్శకత్వం వహించిన శైలేష్ కొలను అయితే తెరకెక్కించాడు.

మరి రెండో సినిమా అనౌన్స్ చేసి దీనిని కూడా మరింత యూనిక్ గా నిర్మాత నాని ప్రెజెంట్ చేస్తూ గట్టి ప్రమోషన్స్ కూడా చేసాడు. మరి ఇలా ఓవరాల్ గా అదిరే హైప్ తో వచ్చిన ఈ చిత్రం అందరి అంచనాలు అందుకుందో లేదో ప్రీమియర్స్ చూసినవాళ్లు చెప్పేస్తున్నారు.

ట్విట్టర్ ఆడియెన్స్ అయితే హిట్ 2 కి చాలా వరకు పాజిటివ్ రెస్పాన్స్ నే అందిస్తూ ఉండడం విశేషం. కొంతమంది సినిమా జస్ట్ ఓకే అంటున్నారు మరికొంతమంది అయితే డెఫినెట్ గా సినిమాకి ఇచ్చిన అడల్ట్ సర్టిఫికెట్ కి తగ్గట్టుగా పిల్లలు దూరంగా ఉంటే బెటర్ అని అంటున్నారు.

ఇంకా కొంతమంది ప్రముఖులు అయితే సినిమా డీసెంట్ థ్రిల్స్ చేస్తుంది అంటున్నారు. అయితే హిట్ 1 తో పోలిస్తే మాత్రం అంత రేంజ్ లో సస్పెన్స్ గా లేదని అనేస్తున్నారు. అలాగే అడివి శేష్ మంచి నటన కూడా కనబర్చగా ఇలా ఓవరాల్ గా మాత్రం ట్విట్టర్ ప్రజానీకం మంచి రెస్పాన్స్ ని ఈ చిత్రానికి అందిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో అయితే హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటించగా కోమలి ప్రసాద్ మరో కీలక పాత్రలో నటించింది.