పాత సినిమాతో మరోమారు అదరగొడుతున్న బాలయ్య.!

ప్రస్తుతం మాస్ గాడ్ నందమూరి నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం వీరసింహా రెడ్డి తో బాలయ్య మరో భారీ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. మరి బాలకృష్ణ కొత్త సినిమా తెలుగులో రిలీజ్ అయ్యి ఇప్పుడు హిట్ కాగా నెక్స్ట్ అయితే ఈ సినిమా కన్నా ముందు వచ్చిన భారీ హిట్ సినిమా “అఖండ” మరోసారి రిలీజ్ అయ్యింది.

అయితే ఇది తెలుగులో కాదు హిందీలో కాగా ఈ చిత్రాన్ని హిందీలో RRR లాంటి భారీ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసిన సంస్థ పెన్ స్టూడియోస్ వారు రిలీజ్ చేసారు. దీనితో ఈ చిత్రం నిన్న జనవరి 20న హిందీలో రిలీజ్ కాగా ఈ చిత్రంతో బాలయ్య మరోమారు ఆడియెన్స్ ని అలరిస్తూ అదరగొడుతున్నట్టుగా తెలుస్తుంది.

మరి అఖండ సినిమాని హిందీలో చూసినవారు అయితే ట్విట్టర్ లో తమ స్పందన తెలియజేస్తున్నారు. ఎలా లేదన్న సినిమాకి 5 అవుట్ ఆఫ్ 5 లేదా 4 స్టార్ లు ఇచ్చేస్తున్నారు. మెయిన్ గా సినిమాలో క్లైమాక్స్ కోసం అలాగే బాలయ్య అఘోర పాత్ర కోసం బాగా చెప్పుకుంటున్నారు.

దీనితో ట్విట్టర్ లో మాత్రం సినిమాని హిందీలో చూసిన నార్త్ ఆడియెన్స్ అఖండ ట్రాన్స్ లో మునిగి తేలుతున్నారు. అలాగే మరికొందరు అయితే సినిమాకి మరిన్ని స్క్రీన్స్ యాడ్ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి అయితే దర్శకుడు బోయపాటి శ్రీను మాత్రం నార్త్ లో మరోసారి తన హవా చూపిస్తున్నాడని చెప్పాలి.