టీవీ ‘బాహుబలి’..కార్తీకదీపం సీరియల్‌పై వెల్లువెత్తుతోన్న విమర్శలు

తెలుగునాట ప్రజలకు కార్తీక దీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. నంబర్ వన్‏గా..ఇంకా చెప్పాలంటే టీవీ ఇండస్ట్రీకి బాహుబలి కార్తీకదీపం అపి చెప్పవచ్చు. అయితే ఈ సీరియల్ ఇప్పుడు గాడి తప్పుతుంది అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా కొన్ని ఎపిసోడ్స్ చూస్తే ఆ విషయం నిజమే అనిపిస్తుంది. జాతీయ స్థాయిలోనూ రేటింగ్స్ విషయంలో బిగ్‏బాస్‏ను మించి టాప్‏లో దూసుకుపోతుంది ఈ సీరియల్. అయితే ఈ సీరియల్‏కి లెక్కకు మించి అభిమానులు ఉన్నారు. ఫేమ్ ఉన్నచోట విమర్శలు కూడా కామన్. కానీ ఈ సారి విమర్శలు చేసేవాళ్లు కాస్త..పాయింట్స్ పట్టుకుని ప్రశ్నలు గుప్పిస్తున్నారు.

తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న కార్తీకదీపం సీరియల్‌.. వెయ్యి ఎపిసోడ్స్‌కి చేరువ ఉంది. జాతీయస్థాయిలో రేటింగ్స్‌‌లో దమ్ము చూపిస్తోంది. ‘ఒక్క డిఎన్‌ఏ టెస్ట్‌తో ముగిసిపోయే కథకు.. ఇన్ని మలుపులు?..ఇన్ని ట్విస్టులా’ అని తెగ విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ మధ్య కొన్ని లాజిక్స్‌ మిస్‌ అవుతున్నాయంటూ.. సాగదీత ఎక్కవైంది అన్నట్లుగా తయారవుతోందంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ప్రేక్షకుల మనసులకు తాకేలా ఎమోషనల్ సీన్లతో ఏదో ఒక ట్విస్ట్ ఉంటూ కథ మరీ ఆసక్తికరంగా ఉండేది.

ఈ మధ్య కాలంలో అటువంటి కార్తీకదీపం మార్క్ సన్నివేశాలు తగ్గాయన్నది వారి ఆరోపణ. హిమ తన ‘తల్లిని చూపించాల్సిందే’ అని పట్టుబట్టినప్పుడు డాక్టర్ బాబు ఓకే అంటాడు. పెద్ద సెలబ్రేషన్ పార్టీ ఏర్పాటు చేసిన కార్తీక్‌.. తన లవర్‌ హిమ ఫోటోనే తెప్పించి మరీ.. ‘ఈమె నీ మదర్.. ఇప్పుడు లేదు’ అంటూ హిమకి ఇంట్రడ్యూస్ చేసి.. కన్నీళ్లు మిగిల్చిన సీన్‌ అది. ఆ సీన్‌ అందరికీ బాగానే గుర్తుండే ఉంటుంది. ఆ పార్టీ తర్వాతే వంటలక్క ఎక్కడా కనిపించలేదు. అది సీరియల్‌లో ట్విస్ట్‌. యావత్ తెలుగు రాష్ట్రాల్లో ‘అయ్యో వంటలక్క కనుపడట్లేదు’ అని వీక్షకులు తెగ బాధపడిపోయారు. సరిగ్గా అప్పుడే సౌర్య.. కార్తీక్‏ను నాన్న అని ప్రేమగా పిలవడం, నువ్వే నా నాన్నవని తెలుసు అని చెప్పడం చకచకా జరిగిపోయాయి. ఇవన్నీ నాటకీయంగా ఉన్నయని పలవురు చెబుతున్నారు. మొత్తం మీద ప్రేక్షకులకు ఇంట్రస్ట్ తేవడానికి ఎలాంటి మార్పులు చేర్పులు చేస్తారో వేచి చూడాల్సిందే.