పెళ్ళికి తొందర లేదంటున్న తృప్తి డిమ్రి!

‘యానిమల్‌’ సినిమాతో మంచి గుర్తింపుతో పాటు.. ముందుగా గుర్తొచ్చే పేరు త్రిప్తి డిమ్రి. అంతకుముందు ఓ డజన్‌ సినిమాలకు పైగా చేసిన ఆమెకు రాని గుర్తింపు ఈ ఒక్క చిత్రంతో రావడమేగాక.. ఓవర్‌నైట్‌ స్టార్‌ స్టేటస్‌ సంపాధించింది. ప్రపంచవ్యాప్తంగా మంచి ఫాలోయింగ్‌, గుర్తింపు తెచ్చుకుంది.

ప్రస్తుతం ఈ అమ్మడు పేరు వాడుకోకుండా ఏ మీడియా సంస్థ లేదంటే అతిశయోక్తి కాదు. ఏదో సందర్భంలో ఆమెకు సంబంధించిన ఏదో ఓ వార్త అయ్యేలా ఘనత దక్కించుకుంది. అయితే ఈ ఒక్క ‘యానిమల్‌’ సినిమాతో సాధించిన పేరుతో ఆఫర్లు త్రిప్తి డిమ్రి ఇంటి తలుపు తడుతున్నాయి.

ఈ క్రమంలో ఇప్పటికే తెలుగులో రెండు చిత్రాలకు సైన్‌ చేసినట్లు తెలుస్తోండగా మరో నాలుగు బాలీవుడ్‌ చిత్రాలను లైన్‌లో పెట్టినట్టు సమాచారం. అయితే ఈ ముద్దుగమ్మ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందనే వార్త నెట్టింట బాగా హల్‌చల్‌ చేస్తోంది.

ఇదే విషయమై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో త్రిప్తి డిమ్రి మాట్లాడుతూ పెళ్లికి సంబంధించి తన మనసులోని మాటను బయట పెట్టింది. ఇప్పట్లో తనకు పెళ్లి చేసుకోవాలనే కోరిక లేదని, ప్రస్తుతానికి నా కేరీర్‌ పైనే దృష్టి పెట్టానని 2030 తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తానని స్పష్టం చేసింది.

అయితే నాకు కాబోయే భర్తకు చిల్లి గవ్వ ఉండకున్నా ఫర్వాలేదని.. మంచి మనసు ఉండి అవతలి వారిని అర్ధం చేసుకునే గుణం ఉంటే చాలని తెలిపింది. దీంతో ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో బాగా వైరల్‌ అవుతున్నాయి.