ట్రైలర్ టాక్ : మైండ్ బ్లాకింగ్ ఎలిమెంట్స్ తో షారుఖ్ “పఠాన్”.!

ప్రస్తుతం బాలీవుడ్ సినిమా దగ్గర భారీ అంచనాలు పెట్టుకొని రిలీజ్ కి రెడీగా ఉన్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది షారుఖ్ ఖాన్ హీరోగా దీపికా పదుకొనె హీరోయిన్ గా నటించిన చిత్రం “పఠాన్” మాత్రమే ఉంది. మరి ఈ సినిమాపై ఎప్పుడు నుంచో భారీ హైప్ ఉండగా ఆ మధ్య వచ్చిన టీజర్ మంచి ట్రీట్ ని ఇచ్చి మరింత స్థాయిలో అంచనాలు పెంచింది.

ఇక ఈ అవైటెడ్ సినిమా నుంచి చిత్ర బృందం పాన్ ఇండియా వైడ్ అన్ని భాషల ట్రైలర్ లు రిలీజ్ చేయగా ఇప్పుడు ఈ ట్రైలర్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వస్తున్నాయి. మరి ట్రైలర్ ట్రైలర్ చూసినట్టు అయితే ఇది మాత్రం మైండ్ బ్లాకింగ్ గా ఉందని చెప్పి తీరాలి.

దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ నుంచి మరో కంప్లీట్ బిగ్గెస్ట్ ఏక్షన్ సినిమాగా ఇది కనిపిస్తుంది. ఉగ్రవాదులు లాంటి వారై భారీ మిషన్ లో భాగంగా ఇండియాని టార్గెట్ చేసే దానిని పఠాన్ అనే ఏజెంట్ భారత్ తరపున ఎలా ఎదుర్కొంటాడు అనే అంశాలు నెక్స్ట్ లెవెల్ ఏక్షన్ ఎలిమెంట్స్ తో దర్శకుడు ప్రెజెంట్ చేసాడు.

ప్రతి షాట్ కూడా సినిమా ఏక్షన్ మూవీ లవర్స్ కి ఓ ట్రీట్ ఇచ్చేలా ఉన్నాయి. ఇక దీపికా పదుకొనె డిఫరెంట్ గెటప్ లు ఆమెతో కూడా ఏక్షన్ ఎపిసోడ్ లు రోమాలు లెగిచే లా ఉన్నాయి. ఇక షారుఖ్ అండ్ జాన్ అబ్రహం మధ్య సీన్స్ కూడా అదిరిపోయేలా ఉన్నాయి.

ఇక ఈ ట్రైలర్ లో విశాల్ అండ్ శేఖర్ ఇచ్చిన మ్యూజిక్ కూడా బాగా ఎలివేట్ చేసింది. మొత్తానికి ఇలా మైండ్ బ్లోయింగ్ గా ఉన్న ఈ ట్రైలర్ సినిమా ఎలా ఉందో తెలియాలి అంటే ఈ కన్నవారి 25 వరకు ఆగాల్సిందే. 
Pathaan Trailer | Telugu Version | Shah Rukh Khan | Deepika, John | Siddharth A | YRF Spy Universe