రవితేజ “రావణాసుర” ట్రైలర్ ఎప్పుడంటే.!

టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ ఎనర్జిటిక్ సీనియర్ స్టార్ హీరోస్ లో మాస్ మహారాజ రవితేజ కూడా ఒకరు. మరి రవితేజ అయితే ఇప్పుడు రెండు భారీ హిట్స్ “ధమాకా” మరియు “వాల్తేరు వీరయ్య” లతో ఏకంగా 300 కోట్ల వసూళ్లు కేవలం రెండు నెలల వ్యవధి లోనే అందుకున్న మాస్ మహారాజ ఇప్పుడు నెక్స్ట్ సినిమాగా ఓ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ “రావణాసుర” తో అయితే తాను రాబోతున్నాడు.

లాస్ట్ టైం వచ్చిన రెండు ఎంటర్టైనర్స్ కి భిన్నంగా ఇది థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో దర్శకుడు సుధీర్ వర్మ తో అయితే రాబోతుంది. మరి అంతకంతకు క్యూరియాసిటీ పెంచుకున్న ఈ సినిమా నుంచి మేకర్స్ ఇప్పుడు బిగ్ అప్డేట్ ని అయితే అందించారు. ఈ సినిమా అవైటెడ్ ట్రైలర్ ని అయితే ఈ మార్చ్ 28న రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.

అలాగే 28న సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకి ఈ ట్రైలర్ వస్తుందని తాము అనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమాలో అయితే మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా అలాగే దక్ష నగార్కర్, పూజితా పొన్నాడ అను ఇమ్మానుయేల్ ఇంతమంది హీరోయిన్స్ నటిస్తున్నారు. మరి ఇంతమంది ఎలా మానేజ్ అయ్యారు అనేది కూడా ఈ సినిమాలో ఆసక్తిగా మారింది. ఇక ఈ సినిమాకి అయితే రవితేజ కూడా నిర్మాణం వహించగా ఈ ఏప్రిల్ 7న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.