సినిమా హీరోగా కష్టం బాస్.!

‘స్వయంవరం’ సినిమాతో హీరోగా పరిచయమైన వేణు తొట్టెంపూడి ఆ తర్వాత పలు సినిమాలతో మినిమమ్ గ్యారంటీ హీరో అనిపించుకున్నాడు. ఆ తర్వాత మెల్ల మెల్లగా కెరీర్ డల్ అవుతూ వచ్చింది వేణుకి.

ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ పలువురు స్టార్ హీరోలతో మల్టీ స్టారర్ సినిమాలతోనూ కొన్ని విజయాలు తన కెరీర్‌లో వేసుకున్నాడు వేణు.

ఆ తర్వాత చాలా కాలం సినిమాలకు దూరమైపోయాడు. ఏం జరిగిందో ఏమో తెలీదు కానీ, విదేశాలకు వెళ్లి స్ధిరపడిపోయాడు. ఇటీవలే రవితేజ హీరోగా వచ్చిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా తర్వాత మళ్లీ వేణు యాక్టింగ్‌లో రీ ఎంట్రీ ఇచ్చాడు.

ఆ సినిమాలో వేణు పాత్ర అంత పవర్ ఫుల్‌గా వుండబోతోంది.. ఇంత పవర్ ఫుల్‌గా వుండబోతోందంటూ రిలీజ్‌కి ముందు గట్టిగా ప్రచారం చేశారు. కానీ, రిలీజ్ తర్వాత ఆ పాత్ర పెద్దగా పేలింది లేదు. సినిమా ఆశించిన విజయం అందుకున్నదీ లేదు.

తాజాగా వేణు ఓ వెబ్ సిరీస్‌లో ప్రత్యక్షమయ్యాడు సడెన్‌గా. ‘అతిథి’ అనే పేరుతో వచ్చిన ఈ హారర్ వెబ్ సిరీస్ ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తోంది. వెబ్ సిరీస్ కారణంగా వేణు పేరయితే మళ్లీ వినిపిస్తోంది కానీ, ఇది ఛాన్స్‌గా తీసుకుని హీరోగా ఛాన్సులు కావాలంటున్నాడనీ ప్రచారం జరుగుతోంది.

అయితే, హీరోగా ఛాన్సులొచ్చే అవకాశం లేదనీ, సిరీస్‌లతో బాగానే ట్రై చేయొచ్చు కదా.. అని సలహాలిస్తున్నారట ఇండస్ర్టీలో కొందరు. కానీ, మళ్లీ హీరోగా ప్రయత్నాలు మొదలెట్టాడనీ తెలుస్తోంది వేణు.