‘ధమాకా’, ‘వాల్తేర్ వీరయ్య’ సినిమాలతో ట్రాక్ ఎక్కశాడు మాస్ రాజా రవితేజ అని ఆయన ఫ్యాన్స్ తెగ సంబరపడిపోయారు. అంతకు ముందొచ్చిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా విషయంలోనే రవితేజ వేలు పెట్టి కెలికేశాడు.. అందుకే ఫెయిలయ్యాడు.. అనే టాక్ వినిపించింది.
‘ధమాకా’ విషయంలోనూ ఇదే టాక్ వినిపించింది. కానీ, కెలికినా అదృష్టం ఏదో రూపంలో కలిసొచ్చి ‘ధమాకా’ హిట్ లిస్టులో చేరిపోయింది. అయితే, ‘రావణాసుర’ విషయంలోనూ రవితేజ కెలుకుడు మరీ ఎక్కువైందట. దాంతో, ఫలితం అనుభవించక తప్పలేదంటున్నారు.
ఈ తీరు మార్చుకోకపోతే మాస్ రాజా కెరీర్ జంజాటంలో పడ్డట్లే. చేయాల్సిన చాలా ప్రాజెక్టులున్నాయ్. ఈ కెలుకుడు యవ్వారం నుంచి రవితేజ బయట పడకుంటే, ఫ్యూచర్ కెరీర్ ఇరకాటంలో పడిపోతుందని సన్నిహితులు హెచ్చరిస్తున్నారట.
‘రామారావు ఆన్ డ్యూటీ’ టైమ్‌లోనే ఆయన సన్నిహితులు గట్టిగా హెచ్చరించారట. అయితే, మాస్ రాజా ధోరణి మార్చుకోలేదట. దాంతో, ఇదిగో ఇప్పుడు రిజల్ట్ ఈ రేంజ్‌లో ‘రావణాసుర’ రేంజ్‌లో బెడిసి కొట్టిందని రవితేజకు గట్టిగా గడ్డి పెట్టేస్తున్నారట.
ఈ సినిమా విషయంలో నిర్మాతలు చాలా చాలా నష్టపోయారనీ తెలుస్తోంది.