ఆ ముగ్గురు హీరోలు నా స్వయంవరంలో ఖచ్చితంగా ఉండాలి.. రష్మిక!

సోలో సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టిన రష్మిక పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు పొందింది. దీంతో బాలీవుడ్ లో కూడా ఈ అమ్మడి క్రేజ్ పెరిగిపోయి వరుస ఆఫర్లు దక్కించుకుంటుంది. ఇక హింది లో రష్మిక నటించిన “గుడ్ బై” సినిమా సెప్టెంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మీకి సినిమా విశేషాలతో పాటు తన వ్యక్తిగత జీవితం గురించి కూడా ఎన్నో విషయాలను వెల్లడించింది. ఈ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నలకు రష్మిక ఆసక్తికర సమాధానాలు చెప్పింది. ఈ క్రమంలో మీ స్వయంవరంలో ఎవరెవరు హీరోలు ఉండాలి అని యాంకర్ అడగ్గా.. రష్మిక స్పందిస్తూ అల్లు అర్జున్, రణబీర్ కపూర్, విజయ్ సేతుపతి అంటూ టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీస్ కి చెందిన స్టార్ హీరోలను సెలెక్ట్ చేసుకుంది.

ప్రస్తుతం రష్మిక బాలీవుడ్ సినిమాలతో పాటు తమిళ్, కన్నడ, తెలుగు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. ఇక తెలుగులో అల్లు అర్జున్ సరసన పుష్ప 2 సినిమాలో నటించనుంది. పుష్ప సినిమా మొదటి భాగంలో రష్మిక తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దీంతో పుష్ప పార్ట్ 2 లో రష్మిక పాత్ర ఎలా ఉంటుందో అని ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.