నాలుగేళ్ల చిన్నారి అత్యాచార ఘటనపై స్పందించిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్..?

రోజు రోజుకి దేశంలో అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతోంది. ఈరోజుల్లో ముసలి వారు చిన్న పిల్లలు అని తేడా లేకుండా మహిళల మీద అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఉన్న డి ఏ వి పాఠశాలలో నాలుగేళ్ల చిన్నారి మీద ప్రిన్సిపల్ డ్రైవర్ లైంగిక దాడి చేసిన ఘటన కలకలం సృష్టిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ఘటనపై స్పందించి సదరు పాఠశాలని సీజ్ చేసి ఈ దారుణానికే పాల్పడిన డ్రైవర్ తో సహా ప్రిన్సిపాల్ మీద కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ ఘటనపై ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల స్పందించాడు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేస్తూ… ‘ నగరంలోని డీఏవీ పాఠశాలలో చదువుతున్న నాలుగేళ్ల బాలికపై ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడటం చాలా ఘోరమైన సంఘటన. నిస్సహాయతతో నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. నాలుగేళ్ల చిన్నారిపై ఇలా అఘాయిత్యం చేయటంతో ఆ పాప పడే వేదన ఊహించలేకపోతున్నాను అంటూ రాసుకోచ్చాడు. ఇక ఘటనలో ధైర్య సాహసలతో న్యాయం కోసం పోరాటం చేస్తున్న ఆ బాలిక తల్లిదండ్రులకు నా జోహార్లు.

పిల్లల భద్రత విషయంలో తల్లిదండ్రులు ఎప్పుడు రాజీ పడకూడదు. ప్రస్తుతం ఉన్న ఈ ఆధునిక సమాజంలో ఇటువంటి సంఘటనలు మరొకసారి జరగకుండా ఉండాలంటే పిల్లల తల్లిదండ్రులు వారి పిల్లలకు భద్రతకు సంబంధించి అనుకూల వాతావరణం కల్పించాలి. పిల్లల భద్రత విషయంలో తల్లిదండ్రులు రాజీ పడితే భయంకరమైన సమాజాన్ని రూపొందించినవారు అవుతాము… అంటూ సోషల్ మీడియాలో పోస్టు షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నాలుగేళ్ల చిన్నారిపై హత్యాచారం చేసిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాలలో కలకలం సృష్టిస్తుంది.