గాడ్ ఫాదర్ సక్సెస్ స్పందించిన సల్మాన్.. ఏమన్నారంటే?

మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన చిత్రం గాడ్ ఫాదర్.మలయాళం లో సూపర్ హిట్ అందుకున్నటువంటి లూసీ ఫర్ చిత్రానికి రీమేక్ చిత్రంగా ఈ చిత్రాన్ని మోహన్ రాజా ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. విజయదశమి సందర్భంగా ఈ సినిమా అక్టోబర్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే.ఇక ఈ సినిమా విడుదలైన అనంతరం ప్రతిచోట పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని దూసుకుపోతుంది.ఇక ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ స్పందించారు.

ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా రిజల్ట్ పై స్పందిస్తూ ఒక వీడియోని షేర్ చేశారు. ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. మై డియర్ చిరు గారు ఐ లవ్ యు.. గాడ్ ఫాదర్’ బాగా ఆడుతుందని తెలిసింది. కంగ్రాట్యులేషన్స్. గాడ్ బ్లెస్ యు.. వందే మాతరం’ అంటూ సల్మాన్ ఖాన్ వీడియో ద్వారా గాడ్ ఫాదర్ సక్సెస్‌పై రియాక్ట్ అయ్యారు. ఇక ఈ వీడియోని ఈయన సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.

ఈ విధంగా సల్మాన్ ఖాన్ ఈ వీడియోని షేర్ చేస్తూ.. దానికి ‘#గాడ్ ఫాదర్’ అని క్యాప్షన్ పెట్టి చిరంజీవి, రామ్ చరణ్‌లను ట్యాగ్ చేశాడు. అతను పోస్ట్‌ను షేర్ చేసిన వెంటనే, రామ్ చరణ్ కామెంట్ చేశారు. ముడుచుకున్న చేతులు హార్ట్‌ ఎమోజీలతో రామ్ చరణ్ రిప్లై ఇచ్చారు.ఇక ఈ సినిమా నిర్మాణంలో రామ్ చరణ్ కూడా భాగస్వామ్యం అయిన విషయం మనకు తెలిసిందే. ఇక ఇందులో సల్మాన్ ఖాన్ తో పాటు నయనతార సత్యదేవ్ వంటి స్టార్ సెలబ్రెటీలు నటించారు.