అర్జున్, విశ్వక్ సేన్ మద్య ముదిరిన వివాదం.. అర్జున్ వ్యాఖ్యలపై స్పందించిన స్పందించిన విశ్వక్ టీమ్..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంటెడ్ హీరోగా గుర్తింపు పొందిన విశ్వక్ సేన్ గురించి తెలియని వారంటూ ఉండరు. హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన విశ్వక్ అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందాడు. ఇటీవల “అశోక వనంలో అర్జున కళ్యాణం” సినిమా ద్వారా హిట్ అందుకున్న విశ్వక్… తాజాగా “ఓరి దేవుడా” సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇదిలా ఉండగా తాజాగా సీనియర్ హీరో అర్జున్ సర్జ, విశ్వక్ సేన్ మద్య వివాదం మొదలైనట్లు తెలుస్తోంది.

అర్జున్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటించడానికి విశ్వక్ అంగీకరించినట్లు సమాచారం. అయితే తాజాగా విశ్వక్ ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అర్జున్ విశ్వక్ మీద ప్రొడ్యూసర్స్ గిల్డ్ లో ఫిర్యాదు చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన అర్జున్ ఈ సమావేశంలో మాట్లాడుతూ…విశ్వక్ సేన్ ఒక నిబద్దతలేని హీరో.. అన్ ప్రొఫెషనల్ నటుడు అంటూ మండిపడ్డారు. తనలా మరొకరికి అన్యాయం జరగకుండా విశ్వక్ సేన్ పై ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు అర్జున్ తెలిపారు.

అయితే విశ్వక్ సేన్ గురించి అర్జున్ చేసిన వ్యాఖ్యలపై ఇటీవల విశ్వక్ బృందం స్పందించింది. కథ విషయంలో కొన్ని మార్పులు చేయాలని విశ్వక్ సేన్ సూచించిన మాట నిజమేనని సిబ్బంది తెలిపారు. అయితే కథలో ఆసక్తికరంగా ఉండే చిన్న చిన్న మార్పులకు అర్జున్‌అంగీకరించటం లేదని …అంతా తాను చెప్పినట్లే నడుచుకోవాలని అర్జున్ ప్రవర్తిస్తున్నాడు. సెట్‌లో విశ్వక్ సేన్ మాటకు అర్జున్ గౌరవం ఇవ్వలేదని సిబ్బంది తెలిపారు. అందుకే మనసుకు నచ్చని పని చేయలేక విశ్వక్ సేన్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారని సిబ్బంది వివరించారు. అంతే కాకుండా ఈ సినిమాకు సంబంధించిన ఒప్పంద పత్రాలు ఇటీవల నిర్మాతల మండలికి పంపినట్లు విశ్వక్ సేన్ సిబ్బంది తెలిపారు. అయితే ఈ వ్యవహారంపై విశ్వక్ సేన్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవటం గమనార్హం.