చిరంజీవి మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ ఇప్పటికే ‘ఉప్పెన’, ‘కొండపోలం’ లాంటి సినిమాలతో అలరించి ఇప్పుడు ‘రంగరంగ వైభవంగా’ సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. గిరీశాయ దర్శకత్వంలో కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2 నా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతుంది.
ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ గెస్టులుగా విచ్చేసారు. ఈవెంట్ లో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ, మా మావయ్యలు ముగ్గురూ కూడా ఎంతో కష్టపడి నేడు ఈ స్థాయికి రావడమే కాదు మాలోని ప్రతి ఒక్కరిని కూడా లైఫ్ తో కెరీర్ తో ఎప్పుడూ పోరాడుతూ శ్రమతో కష్టపడి పైకి ఎదగాలని చెప్తుంటారని అన్నారు. అలానే వారే మా ఇన్స్పిరేషన్ అని అన్నారు.
అలాగే ఈ సినిమా కోసం తమ్ముడు వైష్ణవ్ ఎంతో కష్టపడ్డాడని, మూవీ యూనిట్ మొత్తానికి తన తరపున ముందస్తు అభినందనలు తెలియచేసారు సాయి ధరమ్ తేజ్. ఈవెంట్ చివర్లో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ ఇంటికి వెళ్ళేటపుడు ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వెళ్లాలని, బైక్ వెళ్ళేటపుడు మరింత జాగ్రత్త వహించండని, వేగంగా వెళ్లవద్దని కోరారు. ఒకవేళ బైక్ మీద ప్రక్కన ఇంటికి వెళ్లాల్సివచ్చినా సరే తప్పకుండా హెల్మెట్ మాత్రం మర్చిపోకుండా పెట్టుకోండి, ఎందుకంటే నాకు యాక్సిడెంట్ జరిగిన సమయంలో నా తలకి హెల్మెట్ లేకపోతే నేడు నేను ఈ విధంగా మీ ముందు నిలబడి మాట్లాడుతుండే వాడిని కాదని ఎంతో ఎమోషనల్ గా ఆ ఘటనని తల్చుకుంటూ మాట్లాడారు. అయితే తేజ్ మాటలకు వరుణ్, వైష్ణవ్, సహా స్టేజి మీద వారు, మెగా అభిమానులు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఎమోషనల్ గా ఫీలయ్యారు.