టాలీవుడ్ లో ఉన్న స్టార్ కమెడియన్ నటుల్లో చాలా మందే మొదటగా కమెడియన్ గా స్టార్ట్ అయ్యి హీరోలుగా విలన్ లుగా కూడా మారిన వారు ఉన్నారు. అయితే వారిలో కెరీర్ స్టార్ట్ చేసిన కొన్నేళ్లలోనే హీరోలుగా మారిపోయారు. అయితే ఈ కమెడియన్స్ లో టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ ఉన్న వెన్నెల కిషోర్ కూడా ఒకడు.
మరి వెన్నెల కిషోర్ ఇప్పటివరకు వందల చిత్రాల్లో తనదైన కామెడీ రోల్స్ లో కనిపించి ఆకట్టుకోగా చాక కేవలం ఒకటి రెండు చిత్రాల్లో మాత్రమే కాస్త సీరియస్ రోల్స్ చేసాడు. అయితే ఇప్పుడు తాను హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు.
దర్శకుడు టిజి కీర్తి కుమార్ దర్శకత్వంలో అదితి సోనీ నిర్మాణంలో లేటెస్ట్ గా అనౌన్స్ చేసిన చిత్రమే “చారి 111”. ఓ క్రేజీ అండ్ కామెడీ స్పై డ్రామాగా ప్లాన్ చేస్తున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ రిలీజ్ చేసిన ఓ యానిమేషన్ వీడియో కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నటుడు మురళి శర్మ హీరోయిన్ సంయుక్త విశ్వనాథన్ లు నటించగా ప్రియా మాలిక్ తదితరులని పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన ఈ వీడియో బాగుంది.
అంతే కాకుండా ఇందులో వెన్నెల కిషోర్ పాత్రని కూడా ఓ కన్ఫ్యూజింగ్ కామెడీ హీరోగా చూపించిన విధానం కూడా హిలేరియస్ గా వర్కౌట్ అయ్యేలా కనిపిస్తుంది. ఇక ఈ వీడియోలో సైమన్ కే కింగ్ ఇచ్చిన మ్యూజిక్ కూడా ఆకట్టుకోగా ఓ ఇంట్రెస్టింగ్ ఎంటర్టైనర్ తో అయితే హీరోగా వెన్నెల కిషోర్ అదరగొట్టనున్నాడు అని చెప్పొచ్చు.