బుట్ట చేత పట్టుకొని పండ్లు కోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చిన బట్టబొమ్మ … ఫోటోలు వైరల్!

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముకుంద సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ అమ్మడు హిట్, ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటించి హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. ఈ క్రమంలో టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో పూజ హెగ్డే కూడా ఒకరు. అటు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన పూజా హెగ్డే నార్త్ లో కూడా తన సత్తా నిరూపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది.

ప్రస్తుతం పూజా హెగ్డే పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న జనగణమన సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నటిస్తోంది. అంతే కాకుండా బాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటిస్తోంది. ఇక కేజీఎఫ్ హీరో యశ్ తో నటించి కన్నడ పరిశ్రమలో ఎంట్రీ ఇవ్వనుంది. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉండే పూజ హెగ్డే సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. పూజా హెగ్డే తన అందమైన ఫోటోలు వీడియోలతో పాటు వ్యక్తిగత విషయాలకు కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ వారికి మరింత దగ్గరవుతోంది. తాజాగా సోషల్ మీడియాలో పూజ హెగ్డే షేర్ చేసిన కొన్ని ఫోటోలు వైరల్ గా మారాయి.

ప్రతి వీకెండ్ లో అదిరిపోయే ఫోటో షూట్ లతో ఆకట్టుకునే పూజ ఈ వీకెండ్ లో మాత్రం పండ్ల తోటలలో మెరిసింది. మొన్నటివరకు షూటింగ్ లతో బిజీగా ఉన్న పూజా హెగ్డే ఇప్పుడు సినిమాల నుండి కొంత విరామం తీసుకుని కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తోంది. తాజాగా ఈ అమ్మడు ఆర్గానిక్ ఫామ్ లో పండ్లు సేకరిస్తూ కనిపించింది. బుట్ట చేతిలో పట్టుకొని చెట్ల నుండి చెర్రీస్ ని సేకరిస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలను పూజ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.