Tollywood Movies : సమ్మర్ లో వేడి పెంచేందుకు క్యూ కడుతున్న సినిమాలు…!

Tollywood Movies : కేజీఫ్ 2 తో విడుదల కావాల్సిన పాన్ ఇండియా సినిమాల జాబితా అయిపోయినట్లే. రాధే శ్యామ్, ఆర్ఆర్ఆర్, బీస్ట్, కేజీఫ్ 2 ఇలా పాన్ ఇండియా సినిమాలు ఒకదాని తరువాత ఒక్కటి విడుదల అయ్యి అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేసాయి. ఇపుడు వీటి హవా అయిపోయిందనే చెప్పాలి.ఎందుకంటే ఇపుడు మన టాలీవుడ్ సినిమాలు విడుదల సమయం ఆసన్నమైంది. మరో రెండు వారాలలో వరుసగా సినిమాలు విడుదల అవ్వబోతున్నాయి.

ఈ నెలాఖరున మొదటగా మెగా సినిమా ఆచార్య విడుదలకు సిద్ధం అయింది.ఆర్ ఆర్ ఆర్ వంటి బ్లాక్ బస్టేట్ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న చిత్రం కావడం ఇంకా మెగాస్టార్ చిరంజీవి, ఇంకా రామ్ చరణ్ కలిసి నటిస్తున్న సినిమా కావడం తో ఈ సినిమా మీద అంచనాలు పెరిగాయి.అందుకే ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టడానికి సమ్మర్ సీజన్ ని టార్గెట్ చేసుకుంది.

ఆచార్య తరువాత సమ్మర్ సీజన్‌ను టార్గెట్‌ చేస్తున్న మరో మూవీ సర్కారువారి పాట. మహేష్ బాబు హీరోగా మాస్‌ యాక్షన్ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలే ఉన్నాయి. పోకిరి మార్క్ హీరోయిజం మరోసారి చూడబోతున్నారంటూ ఇప్పటికే హింట్ ఇచ్చారు మహేష్. అందుకే సమ్మర్ బరిలో సర్కారువారి పాట మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక సమ్మర్ లో వస్తున్న మరో చిత్రం ఎఫ్ 3. సీనియర్ హీరో వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌. ఎఫ్ 2 సూపర్ హిట్ కావటంతో ఎఫ్ 3 మీద భారీ అంచనాలు ఏర్పాడ్డాయి.ఇక జూన్ 10 న అంటే సుందరానికి.. సినిమాతో నాచురల్ స్టార్ నానీ కూడా సిద్ధమాయ్యడు.ఇక అభిమానులను సమ్మర్ మొత్తం ఎంగేజ్ చేసేలా మన హీరోలు పక్కా ప్లాన్ తో వచ్చేస్తున్నారు.