టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఈ మధ్య పూరీ మ్యూజింగ్స్ పేరుతో తన మనసులోని భావాలను తన అభిమానులతో పంచుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన తాజాగా నైట్ మ్యూజింగ్స్ పేరుతో ఓ ఆడియోను వదిలారు.
దాంట్లో రాత్రి గురించి ఎక్కువగా మాట్లాడారు. రాత్రి పూట నిద్రపోయే వాళ్ల గురించి మాట్లాడారు. రాత్రిపూట నిద్రపోకుండా ఎక్కువ సేపు మెలకువతో ఉండేవాళ్లకు ఎక్కువగా తెలివితేటలు ఉంటాయని పూరీ చెప్పుకొచ్చారు.
అలాగే తనకు జరిగిన అనుభవాలను కూడా ఈసందర్భంగా తన అభిమానులతో పంచుకున్నారు. అలాగే శ్రీశ్రీ రాసిన వచనాన్ని కూడా ఆయన వినిపించారు.
వేళ కాని వేళలలో.. లేనిపోని వాంఛలతో… దారికాని దారులలో.. కానరాని కాంక్షలతో దేనికొరకు పదేపదే దేవులాడుతావు… అలసించి.. అలమటించి పాకులాడతావు శ్రీనివాసరావు.. అని నేను చిన్నప్పుడు దీన్ని చదివాను. అది నాకోసమే రాశారా అని అనుకున్నా. పగలు కంటే రాత్రే చాలా విలువైంది. మన చుట్టూ ఉన్న అందరూ నిద్రపోతుంటారు. కానీ.. మనం మేల్కొని ఉంటాం. మనగురించి మనం ఆలోచించుకునే సమయం అప్పుడే దొరుకుతుంది.. అంటూ పూరీ చెప్పుకొచ్చారు.
ఏ లక్ష్యం, కల లేనివాడే 8 గంటలు నిద్రపోతాడు. నీకు ఏదైనా కల ఉంటే ఆ కల నిన్ను నిద్రపోనీయదు. సర్వే ప్రకారం.. రాత్రి పూట ఎక్కువ సేపు మేలుకొని ఉన్నవాళ్లే చురుగ్గా ఉంటారని తెలిసింది. లేటుగా పడుకొని లేటుగా లేచేవాళ్లే ఎక్కువగా డబ్బు సంపాదిస్తారట.. అంటూ తన మనసులో మాటను బయటపెట్టారు పూరీ.
ఇంకా ఆయన ఏమన్నారో.. ఆయన మాటల్లోనే వినండి..