లేటెస్ట్ : “వాల్తేరు వీరయ్య” బ్లాస్ట్ కి సమయం ఖరారు.!

ఇపుడు టాలీవుడ్ లో రిలీజ్ కి రెడీగా ఉన్న పలు మాస్ చిత్రాల్లో మెగాస్టార్ మరియు మాస్ మహారాజ రవితేజాలు హీరోలుగా నటిస్తున్న అవైటెడ్ చిత్రం “వాల్తేరు వీరయ్య” కూడా ఒకటి. అయితే ఈ సినిమా తో పాటుగా ఇతర అన్ని సినిమాలు కూడా ఆల్రెడీ రిలీజ్ డేట్ లను ఫిక్స్ చేసుకోగా వాల్తేరు వీరయ్య ఎప్పుడు వస్తాడా అని అభిమానులు చూస్తున్నారు.

మరి ఈ బ్లాస్టింగ్ అప్డేట్ ని చిత్ర యూనిట్ బ్రేక్ చేసారు. ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్సమెంట్ అయితే ఈరోజు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకి రివీల్ చేస్తున్నట్టుగా ఖరారు చేశారు. అయితే ఈ డేట్ ప్రస్తుతానికి మాకున్న సమాచారం ప్రకారం ఈ జనవరి 13న సోలోగా ఉండొచ్చని అంటున్నారు.

మరి దీనిపై అధికారిక క్లారిటీ అయితే ఈరోజు వచ్చేస్తుందని చెప్పొచ్చు. ఇంకా ఈ హీరోయిన్ గా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా రవితేజ సరసన మరో హీరోయిన్ నటిస్తుంది. అలాగే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఇస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్నాడు అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.