ట్రైలర్ టాక్ : మైండ్ బ్లోయింగ్ గా “టైగర్ నాగేశ్వరరావు” కట్ 

ప్రస్తుతం టాలీవుడ్ సినిమా దగ్గర రిలీజ్ కి రానున్న పలు భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లలో మాస్ మహారాజ రవితేజ హీరోగా కొత్త దర్శకుడు వంశీ తెరకెక్కించిన చిత్రమే “టైగర్ నాగేశ్వరరావు”. కాగా ఈ భారీ చిత్రంని కాశ్మీర్ ఫైల్స్ నిర్మాతలు ఈ చిత్రాన్ని నిర్మాణం వహించగా ఈ చిత్రం అయితే నిజ జీవిత సంఘటనల ఆధారంగా వాటి రూమర్స్ ద్వారా అయితే తెరకెక్కించారు.

కాగా ఈ భారీ చిత్రం నుంచి అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ కట్ ని ఇప్పుడు మేకర్స్ రిలీజ్ చేశారు. మరి ఈ ట్రైలర్ డెఫినెట్ గా అంచనాలు పెంచే విధంగా ఉందని చెప్పాలి. రవితేజ పై సాలిడ్ ఎలివేషన్స్ తో మొదలైన ఈ ట్రైలర్ ఇక ఆగలేదు.

టైగర్ నాగేశ్వరరావు తాలూకా ఫోకస్ తన స్త్రీ వ్యామోహం ఏదైనా ఆశ పడితే పట్టు విడువడు అన్నట్టుగా ఇంకా హీరోయిన్ నపూర్ సనన్ తో లవ్ సీన్స్ ఇలా ఓ రేంజ్ లో ఈ ట్రైలర్ ఉంది. అలాగే గతంలో టీజర్ కంటే కొంచెం బెటర్ గ్రాఫిక్స్ కూడా ఈ ట్రైలర్ లో కనిపించగా నటుడు జిస్సు సేన్ గుప్త అయితే ఓ క్రేజీ రోల్ చేస్తున్నాడని అర్ధం అవుతుంది.

అంతే కాకుండా నటుడు నాజర్, రేణు దేశాయ్ లు కూడా ఈ సినిమాలో కీలక పత్రాలు చేస్తుండగా మురళీ శర్మ మరియు బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ లు పాత్రలు అవి రవితేజ ఇచ్చిన ఎలివేషన్ లు అయితే అదిరిపోయాయి. ఇంకా అన్ని అంశాల్లో కూడా భారీతనాన్ని కనబరిచిన ఈ చిత్రం ట్రైలర్ మాస్ మహారాజ్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ తో మైండ్ బ్లోయింగ్ గా ఉంది. ఇక ఈ సినిమా అయితే ఈ అక్టోబర్ 20న గ్రాండ్ గా విడుదల కాబోతుండగా తెలుగు సహా హిందీ తమిళ్ మరియు కన్నడ మలయాళ భాషల్లో రాబోతుంది. 
Tiger Nageswara Rao Trailer - Telugu | Ravi Teja | Vamsee | Anupam Kher | Abhishek Agarwal