Beast vs KGF 2: విజయ్ కి యష్ మధ్యలో నేనున్నానంటున్నా షాహిద్ కపూర్…!

Beast vs KGF2: పెద్ద హీరోల సినిమాలు ఒకసారి విడుదలకాకుండా సమన్వయంతో విడుదల తేదీని ఖరారు చేస్తారు. అయితే కరోనా కారణంగా సినిమాల షూటింగులు ఆలస్యం అవడం విడుదలకావ్వాల్సినవి వాయిదా పడటం జరగటం తో ఇపుడు వరుసగా సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. వారం గ్యాప్ తో విడుదల చేస్తేనే వసూళ్ళపరంగా నష్టాలను చూస్తాయి సినిమాలు అలాంటిది ఒకే రోజున విడుదలైతే ఇక సినిమాల భవితవ్యం ఇలా ఉంటుందో చెప్పనక్కరలేదు.

ఇపుడు ఎలాంటి పరిస్థితే ఎదురవుతోంది. అదికూడా ఒకే భాష చిత్రాలు కాదు. మూడు భాషా చిత్రాలు ఒకే రోజు పోటీపడనున్నాయి. ఇంతకు మునుపే విజయ్ బీస్ట్, యష్ కెజిఎఫ్ 2 ఒకే వారంలో పోటీపడనున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక ఇపుడు వీటికి పోటీగా హిందీ లో షాహిద్ కపూర్ నటించినా తెలుగు జెర్సీ రీమేక్ చిత్రం జెర్సీ కూడా ఒకే వారం లో థియేటర్లలో విడుదలకానున్నాయి.

ఏప్రిల్ 13 న విజయ్ నటించినా బీస్ట్ విడుదలకానుండగా ఏప్రిల్ 14 న యష్ కెజిఎఫ్ 2, షాహిద్ కపూర్ నటించినా జెర్సీ విడుదల అవుతున్నాయి.దీంతో వాళ్ళ సినిమా వసూళ్లను వాళ్లే మింగేస్తారని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.ఇక మూడు అభిమానులు ఎదురుచూసిన సినిమాలు ఒకేసారి ఇలా విడుదలవ్వడం వారి అభిమానులను కలవరపెడుతోంది. అయితే రేస్ లో ఏ సినిమా నిలుస్తుందో వేచి చూడాలి.