అందాల రాక్షసి మౌనీ రాయ్‌ని భరింగలమా.?

బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్, తెలుగులో ఇంతవరకు స్ట్రెయిట్ ఫిలిం ఏదీ చేసింది లేదు.! కానీ, సౌత్‌లో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. అదీ ‘కేజీఎఫ్-2’ కోసం. ఈసారి స్ట్రెయిట్ తెలుగు ఫిలిం దిశగా, మౌనీ రాయ్‌తో సంప్రదింపులు నడుస్తున్నాయట.

ఓ టాలీవుడ్ దర్శకుడు మౌనీ రాయ్‌‌తో తన సినిమాలో స్పెషల్ సాంగ్ చేయించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. సదరు దర్శకుడు, ఆ దర్శకుడితో సినిమా ప్లాన్ చేసిన నిర్మాత, ఇప్పటికే మౌనీ రాయ్‌తో సంప్రదింపులు షురూ చేసినట్లు తెలుస్తోంది.

స్పెషల్ సాంగ్ మాత్రమే కాదు, సినిమాలో ఆమెకు నటించేందుకూ కొంత ఆస్కారం వుందిట. ఇంతకీ, మౌనీ రాయ్ ఏం చెప్పిందబ్బా.? అంటే, రెమ్యునరేషన్ గట్టిగా డిమాండ్ చేసిందనీ, దాంతో, దర్శకుడు నిర్మాత డైలమాలో పడ్డారని అంటున్నారు.

చిన్నా చితకా సినిమా ఏమీ కాదుట అది. ఓ మోస్తరు బడ్జెట్ సినిమానే. కానీ, మౌనీ రాయ్ కోట్ చేసిన ఫిగర్‌ని భరించలేమని సదరు దర్శకుడు, నిర్మాత చేతులెత్తేసినట్లు తెలుస్తోంది.

మౌనీ రాయ్ స్థానంలో ఊర్వశి రౌతెలా పేరుని ప్రస్తుతం పరిశీలిస్తున్నారట. ఇంకో బాలీవుడ్ బ్యూటీ పేరు కూడా పరిశీలనలో వున్నట్లు తెలుస్తోంది. మౌనీ రాయ్ మాత్రం, తనకు కథ నచ్చితే చాలనీ, సౌత్ సినిమాల్లో నటించాలని వుందనీ ఇంటర్వ్యూల్లో స్టేట్మెంట్లు పాస్ చేసేస్తోంది.

వాస్తవానికి మౌనీ రాయ్ ఇప్పుడేమంత బిజీగా లేదు గానీ.. దర్శక నిర్మాతలకు రెమ్యునరేషన్ పరంగా అస్సలు అందట్లేదామె.!