సలార్‌, కేజీఎఫ్‌2 కు లింకు..!

‘సలార్‌’ పై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. డిసెంబర్‌ 22 కోసం ఎదురుచూస్తున్న అభిమానుల అంచనాలని మరింతగా పెంచేస్తూ.. ఈ చిత్రంపై ఇప్పుడు ఓ బిగ్గెస్ట్‌ రూమర్‌ వినిపిస్తుంది. సలార్‌, క్రేజీఎఫ్‌కి లింక్‌ వుందని ఇప్పటికే కథనాలు వచ్చాయి. టీజర్‌ లో కూడా కొన్ని పోలికలు కనిపించాయి. దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ‘కేజీఎఫ్‌’ యూనివర్స్‌ తో ముడిపెడుతూ ‘సలార్‌’ కథని రాసుకున్నారని వినిపించింది.

అయితే ఈ రూమర్స్‌ను నిజం చేస్తూ.. ఇక సాలిడ్‌ న్యూస్‌ బయటకు వచ్చింది. దీపావళి కానుకగా ఈ సినిమా ట్రైలర్‌ అప్‌డేట్‌ను మేకర్స్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ‘సలార్‌’ ట్రైలర్‌ను డిసెంబర్‌ 01 రాత్రి 7 గంటల 19 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ తెలిపారు. అయితే ఈ ట్రైలర్‌ టైంకి.. కేజీఎఫ్‌2 క్లైమాక్స్‌కి ఓ సంబంధం ఉందని సోషల్‌ మీడియాలో ఒక విషయం వైరల్‌గా మారింది. కేజీఎఫ్‌ 2 క్లైమాక్స్‌లో రాఖీబాయ్‌ తన వద్ద ఉన్న బంగారంతో సముద్రంలో ఓ పెద్ద షిప్‌పై వెళ్తుంటాడు.

కాగా ఆ షిప్‌ స్టీరింగ్‌ ఏరియాలో వివిధ టైమ్‌లైన్స్‌కు సంబంధించిన నాలుగు గడియారాలు అంటాయి. అందులో ఒక గడియారంలో టైమ్‌ సరిగ్గా 7:19 నిమిషాలని ఉంటుంది. అయితే ‘సలార్‌’ ట్రైలర్‌ టైం కూడా 7 గంటల 19 నిమిషాలకు విడుదల మేకర్స్‌ చేప్పడంతో సలార్‌కు, రాఖీ భాయ్‌కి మధ్య ఖచ్చితంగా ఏదో సంబంధం ఉందని ప్రభాస్‌ ఫ్యాన్స్‌ చర్చించుకుంటున్నారు. కాగా దీనిపై క్లారిటీ రావాలంటే ‘సలార్‌’ మూవీ వచ్చేవరకు వెయిట్‌ చేయాల్సిందే….!