హిట్టే.! కానీ, ఫ్లాప్.! ఏం చేద్దాం.?

ఈ మధ్యనే ఓ సినిమా వచ్చింది. హిట్టే.. అంటూ ప్రచారం చేశారు. సినిమా విడుదలకు ముందు, విడుదలయ్యాక.. ప్రచారం హోరెత్తించేశారు. హిట్టు సినిమా.. అని అందరూ ఒప్పుకునేదాకా ఆగలేదు పబ్లిసిటీ.

వ్యవహారం చల్లబడింది. ఇప్పుడు తీరిగ్గా నష్టాల్ని లెక్కలేసుకుంటున్నారు. తప్పు ఎక్కడ జరిగింది.? అన్న పంచాయితీ నడుస్తోంది. నష్టపోయిన ఎగ్జిబిటర్స్ పరిస్థితేంటి.? అన్న గందరగోళంలో కొట్టుమిట్టాడుతున్నారట.

థియేటర్లకు ప్రేక్షకులు రావడంలేదన్న వాదన ఇప్పటిది కాదు.! అందులో కొంత నిజం వుంది. కొంత అవాస్తవం కూడా వుంది. సూపర్ హిట్.. అన్న ప్రచారంతో ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేసే పరిస్థితి లేదు.

అన్ని అనర్థాలకీ ఓటీటీనే కారణమంటూ కొత్త పంచాయితీ మొదలైంది. అలాగని, ఓటీటీ మీద గుస్సా అవుదామా.? అంటే, అట్నుంచి వచ్చే అమౌంట్ నేపథ్యంలో కిమ్మనలేకపోతున్నారు. థియేటర్లను రన్ చేయడం కష్టమవుతోంది. నిర్మాతలకి థియేటర్లలో విడుదల చేయడమూ కష్టమవుతోంది.

ఎలా.? ఈ సమస్యకు పరిష్కారం దొరికేదెలా.? అది మాత్రం అర్థం కావడంలేదు. ఒకటి కాదు, ఈ మధ్యన వచ్చిన రెండు హిట్ సినిమాల థియేట్రికల్ బిజినెస్ విషయంలో జరుగుతున్న రచ్చ ఇది. హిట్టు.. అనిపించిన సినిమాల కథ ఇది. ఫ్లాస్ సినిమాల గురించి మాట్లాడుకోడానికేమీ లేదు.