ఇండస్ట్రీ టాక్ : “టిల్లు 2” నుంచి అనుపమ అందుకే వెళ్లిపోయిందా??

టాలీవుడ్ లో ఇప్పుడే సీక్వెల్ చిత్రాలు మంచి ఊపందుకుంటున్నాయి. మరి సినిమా పెద్దదా అని కాకుండా ఇప్పుడు కంటెంట్ పరంగా మాత్రమే సినిమాలు బాక్సాఫీస్ వద్ద రాణిస్తున్నట్టు ప్రూవ్ అయ్యిపోయింది. దీనితో ఆడియెన్స్ హిట్ అయితే ఏ సీక్వెల్ కోసం అయినా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరి అలాంటి సినిమాల్లో ఇంట్రెస్ట్ గా ఎదురు చూస్తున్న సీక్వెల్ చిత్రం “డీజే టిల్లు 2” కూడా ఒకటి. మరి ఈ చిత్రాన్ని యంగ్ హీరో సిద్ధూ మరియు నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ వారు మంచి స్వింగ్ లో ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నారు.

అయితే మొదట హీరోయిన్ గా అనుకున్న అనుపమ పరమేశ్వరన్ బయటకి వెళ్లిపోవడం ఆమె ప్లేస్ లో మడోనా ఎంటర్ కావడం అన్నీ వెంటవెంటనే జరిగిపోయాయి. అయితే అసలు అనుపమ ఎందుకు బయటకి వెళ్ళిపోయింది అనేది ఇండస్ట్రీ వర్గాల్లో ఇప్పుడు తెలుస్తుంది.

ఈ సినిమాలో కొన్ని సీన్స్ బాగా ఓవర్ గా ఉండడం డైలాగ్స్ కూడా కాస్త ఎబ్బెట్టుగా అనిపించడం మూలానే తాను ఈ సినిమా నుంచి బయటకి వచ్చేసినట్టుగా అంటున్నారు. మరి ఇదే కారణమా వేరే ఏమన్నా ఉందా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ మధ్యనే లిప్ లాక్ లు కూడా ఓకే చెప్పిన అనుపమ కేవలం వీటి కోసమే బయటకి వచ్చింది అంటే కొందరు నమ్మట్లేదు..