డైరెక్టర్ మారుతి అప్పుడు ‘బేబీ’ ఇప్పుడు ‘బ్యూటీ’ !!!

2023 లో వచ్చిన సూపర్ హిట్ సినిమాల్లో ‘బేబీ’ ఒక‌టి. ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం సాధించింది సినిమాలో నటించిన అందరూ ఆర్టిస్ట్ టెక్నీషియన్స్ కు మంచి పేరు తెచ్చి పెట్టింది. ఈ సినిమా నిర్మాణంలో ప్రముఖ ద‌ర్శ‌కుడు మారుతి కీల‌క పాత్ర పోషించారు.

ఇప్పుడు మారుతి నుంచి ‘బేబీ’లాంటి మ‌రో సినిమా వ‌స్తోంది. దీనికి ‘బ్యూటీ’ అనే చ‌క్క‌టి టైటిల్ ఫిక్స్ చేశారు. సుబ్ర‌హ్మ‌ణ్యం ఆర్‌.వీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్‌తో క‌లిసి మారుతి టీమ్ నిర్మిస్తోంది. ఏ. విజ‌య్ పాల్ రెడ్డి నిర్మాత‌. ఈనెల 22న ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభిస్తారు.

అప్పుడే టైటిల్ ని కూడా అధికారికంగా ప్ర‌క‌టిస్తారు. ‘బేబీ’లో సినిమాలో దాదాపు అంతా కొత్త‌వారే క‌నిపించారు. అయితే అందులో క‌ల్ట్ పాయింట్ ప‌ట్టుకొన్నారు. అది యూత్‌కి బాగా న‌చ్చింది. ఈ ‘బ్యూటీ’ కూడా అంతేన‌ని స‌మాచారం. యూత్ ని టార్గెట్ చేస్తూనే, ఫ్యామిలీ ఆడియ‌న్స్‌కి కూడా చేరువ‌య్యే పాయింట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘బేబీ’ ఫేమ్ విజ‌య్ బుల్గానిన్ ఈ చిత్రానికి సంగీతాన్ని స‌మ‌కూరుస్తున్నారు. ఇప్ప‌టికే 3 పాట‌ల్ని రికార్డ్ చేశారు. న‌టీన‌టులు దాదాపుగా కొత్త‌వారే. వారి వివ‌రాలు కూడా ఈ నెల 22నే తెలుస్తాయి.