‘లవ్‌విూ’తో వస్తున్న వైష్ణవి చైతన్య!

ఈమధ్య కాలంలో ఒక తెలుగమ్మాయికి మంచి పేరు వచ్చిందంటే ఆ అమ్మాయి ఒక్క వైష్ణవి చైతన్య అనే చెప్పాలి. ‘అల వైకుంఠపురంలో’ అల్లు అర్జున్‌కి చెల్లెలుగా నటించి ‘వాళ్ళు నా చున్నీ ఎత్తుకెళ్లి పోయారురా’ అంటూ అల్లు అర్జున్‌ తో అన్న ఆ సన్నివేశం అందరికీ గుర్తుంది. అదే వైష్ణవి చైతన్య గురించి అదే అల్లు అర్జున్‌ ‘బేబీ’ సినిమా విజయోత్సవ సభలో ఎంత గొప్పగా చెప్పారో కూడా అందరికీ తెలిసిన విషయమే.

వైష్ణవి చైతన్య ‘బేబీ’ అనే సినిమాతో తెలుగు పరిశ్రమలో ఒక ప్రకంపనలు సృష్టించింది. ఎక్కడినుండో వచ్చి తెలుగురాని కథానాయికలు ఏలుతున్న ఈ సమయంలో అవకాశం ఇస్తే తెలుగు అమ్మాయి ఎంత చక్కటి ప్రతిభను కనబరుస్తుందో చేసి చూపించింది వైష్ణవి. ‘బేబీ’ సినిమాతో విమర్శకుల ప్రశంసలే కాకుండా తెలుగు రాష్టాల్ల్రో యువతని కూడా ఇట్టే ఆకర్షించిన నటి వైష్ణవి చైతన్య. ఇప్పుడు ‘లవ్‌ విూ’ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ వైష్ణవి చైతన్య అని మాత్రమే చెప్పాలి అని అంటున్నారు.మే 25న విడుదలవబోతున్న ‘లవ్‌ విూ’ సినిమాలో అందరి దృష్టి ఇప్పుడు వైష్ణవిపైనే ఉన్నాయని తెలుస్తోంది.

‘బేబీ’ సినిమాతో ఒక సంచలనం సృష్టించిన వైష్ణవి, ‘లవ్‌ విూ’ లో ఎలాంటి పాత్ర చేస్తోంది, ఆమె ప్రతిభని తెలుగు ప్రేక్షకులకి మరోసారి చూపించే దిశగా ఆ పాత్ర ఉంటుందా అనే ఆసక్తితో ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో కథానాయకురాలిగా నటించటంతో పాటు, ఒక పాట కూడా పాడింది. వైష్ణవి. లెజండరీ సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతం సమకూరిస్తే, అయన సంగీత దర్శకత్వంలో వైష్ణవి పాట పాడటం ఇంకొక ఆసక్తికరమైన విషయం. ఈ సినిమాకి దర్శకుడు అరుణ్‌ భీమవరపు, ఛాయాగ్రహణం దేశంలో అత్యంత ప్రతిభావంతుడైన పీసీ శ్రీరామ్‌. ఇంతమంది పెద్ద పెద్ద సాంకేతిక నిపుణలతో పనిచేసే అవకాశం తన కెరీర్‌ ఆరంభంలోనే వైష్ణవికి రావటం నిజంగా ఆమె ప్రతిభకి తార్కాణం. ఆశిష్‌ రెడ్డి ఈ సినిమాలో కథానాయకుడు. ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.