రవితేజ – గోపీచంద్ మరోసారి ఇలాంటి కథతో.!

Ravi-Teja-Krack-1200

ఈరోజు టాలీవుడ్ దగ్గర అనౌన్స్ అయ్యినటువంటి మరో సరికొత్త భారీ ప్రాజెక్ట్ మాస్ మహారాజ రవితేజ అలాగే దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో చేయనున్న నాలుగో ప్రాజెక్ట్ కూడా ఒకటి. కాగా ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ కొలాబరేట్ అయ్యి చేస్తుండగా ఈ సినిమాని అయితే వారిద్దరి కెరీర్ లో భారీ బడ్జెట్ సినిమాగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాపై అయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ అంశాలు ఇప్పుడు తెలుస్తున్నాయి. అయితే ఈ చిత్రం కథ గోపీచంద్ మలినేనినే రాసుకోగా మళ్ళీ ఈ సినిమాని తాను కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా రాసుకున్నట్టుగా తెలుస్తుంది.

అయితే ఆల్రెడీ రవితేజతో ఇంతకు ముందు చేసిన చిత్రం “క్రాక్” ని కూడా ఒంగోలు లో జరిగిన పలు రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగానే చేశారు. ఇక మళ్ళీ ఇపుడు అలాంటి కథతో రాబోతున్నారు. ఇక ఇదెలా ఉంటుందో చూడాలి. అయితే ఈ సినిమా మాత్రం చాలా గ్రాండ్ స్కేల్ లో ప్లాన్ చేస్తున్నారని మంచి బడ్జెట్ తో చేయాలనీ మేకర్స్ చూస్తున్నట్టుగా తెలుస్తుంది.

అలాగే మరో మెయిన్ హైలైట్ ఏమిటంటే ఈ చిత్రంలో మాస్ మహారాజ్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా నెవర్ బిఫోర్ లెవెల్లో ఉంటుంది అని కూడా సమాచారం. మొత్తానికి అయితే మళ్ళీ ఈ సెన్సేషనల్ కాంబినేషన్ ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు అని చెప్పాలి.