“గేమ్ ఛేంజర్” ఫస్ట్ లుక్ వెనక అసలు స్టోరీ ఇదట.!

ప్రస్తుతం టాలీవుడ్ సినిమా దగ్గర నుంచి పాన్ వరల్డ్ లెవెల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోస్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒకరు. కాగా చరణ్ అయితే తన లాస్ట్ సినిమా ట్రిపుల్ ఆర్(RRR) తో భారీ ఫేమ్ తెచ్చుకోగా ఇక నెక్స్ట్ తన ఇమీడియేట్ సినిమా “గేమ్ ఛేంజర్” పై భారీ హైప్ నెలకొంది.

కాగా ఈ సినిమాని పాన్ ఇండియా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తుండగా దీనిపై కూడా గట్టి అంచనాలు కొనసాగుతున్నాయి. ఇక రీసెంట్ గానే సినిమా ఫస్ట్ లుక్ సహా టైటిల్ ని రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది అయితే శంకర్ రేంజ్ లో ఇది లేదు అనే టాక్ కూడా రాగా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే కాస్త డిఫరెంట్ గా ఉందనే టాక్ కూడా వచ్చింది.

మరి అసలు ఈ ఫస్ట్ లుక్ బ్యాక్ స్టోరీ ఏంటి అనేది ఇప్పుడు రివీల్ అయ్యింది. ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ డిజైనర్ మాట్లాడుతూ ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ని తాము 2021 లోనే లాక్ చేశామని అయితే అప్పటికే రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ తో ఓ రేంజ్ లోకి వెళ్లిపోయాడని ఐతే దానికి పోలిక లేకుండా కొత్తగా ఉండాలని చరణ్ ని సింపుల్ అండ్ కూల్ గా ప్రెజెంట్ చేద్దాం చెప్పే శంకర్ ఈ టైప్ లో ఫస్ట్ లుక్ ఉండాలని డిజైన్ చేయించుకున్నట్టుగా తెలిపారు.

అందుకే కాస్త కొత్త కలర్ టోన్ లో కాస్త ఇంగ్లీష్ గా ఉండాలని చెప్పి డిజైన్ చేయించినట్టుగా తెలిపారు. కాగా ఫస్ట్ లుక్ ని అప్పుడు లాక్ చేయగా సినిమా టైటిల్ ని మాత్రం బర్త్ డే కి ముందు లాక్ చేసి రిలీజ్ చేసారని తెలిపారు. ఇది ఈ సినిమా ఫస్ట్ లుక్ వెనుక ఉన్న అసలు స్టోరీ. ఇంకా ఈ సీనియాలోసినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం ఇస్తున్నాడు. అలాగే దిల్ రాజు నిర్మాణం వహిస్తున్నారు.