బంగారు కొండ.! ఈసారైనా కొడతావా.?

విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ అంటూ ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ‘గీత గోవిందం’ సినిమా తాలూకు షేడ్స్ కనిపిస్తున్నాయ్.. అనే చర్చ అంతటా జరుగుతోంది. టీజర్ తర్వాత పాజిటివ్ బజ్ అయితే సినిమా మీద విపరీతంగా క్రియేట్ అయ్యింది.

నిజానికి, ‘ఖుషీ’ సినిమాకి ఇంకా ఎక్కువగా పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. కానీ, సినిమా విజయాన్ని అందుకోలేకపోయింది. ‘మా సినిమా సూపర్ హిట్టే..’ అంటూ హీరో విజయ్ దేవరకొండ చాలా చాలా కష్టపడ్డాడు సినిమా ప్రమోషన్ల కోసం.

సినిమా పబ్లిసిటీ.. దాంతోపాటు సేవా కార్యక్రమాలు.. వెరసి, గట్టిగానే ఖర్చు చేశాడు. ప్చ్.. సినిమా థియేటర్లలో నిలబడలేదు. మరిప్పుడు, ‘ఫ్యామిలీ స్టార్’ పరిస్థితేంటి.? అంటే, ‘మృణాల్ ఠాకూర్ వుందిగా’ అనే సమాధానం వస్తోంది.

నిజమే, మృనాల్ ఠాకూర్ లక్కీ మస్కట్ ఇప్పుడున్న హీరోయిన్లలో.! బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్లు కొట్టేసింది తెలుగులో. ఒకటి ‘సీతారామం’ చాలా పెద్ద హిట్. రెండోది ‘హాయ్ నాన్న’. ఇది కూడా బాగానే వర్కవుట్ అయ్యింది.

చూస్తోంటే, ‘ఫ్యామిలీ స్టార్’ హిట్టయితే, సక్సెస్ క్రెడిట్ అంతా మృనాల్ ఠాకూర్‌కే వెళ్ళిపోయేలా వుందంటూ అప్పుడే చర్చ షురూ అయ్యింది టాలీవుడ్ వర్గాల్లో. క్రెడిట్ ఎవరిదైతేనేం, సినిమా హిట్టయితే చాలు.. ఇదీ ఇప్పుడు విజయ్ దేవరకొండ పరిస్థితి.

విజయ్ ‘ఖుషీ’ సినిమా విషయంలోనూ ఇంతే నెర్వస్‌గా ఫీలయి వుండొచ్చు. కాకపోతే, ఈసారి ఇంకాస్త ఎక్కువ టెన్షన్ ఫీలై తీరాల్సిందే.