సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరో భార్య.!

Ajith

మన సౌత్ ఇండియన్ సినిమా దగ్గర భారీ క్రేజ్ ఉన్న హీరోలు చాలా మంది ఉన్నారు అలాగే అంత క్రేజ్ ఉన్నప్పటికీ సోషల్ మీడియా లేకుండా ఒకవేళ ఉన్నా లో ప్రొఫైల్ మైంటైన్ చేసే స్టార్ హీరోస్ కూడా ఉన్నారు. మరి వీరిలో అయితే కోలీవుడ్ హీరో థలా అజిత్ కుమార్ కూడా ఒకరు.

మరి అజిత్ కుమార్ అయితే హీరోగా ఇప్పుడు తమిళ్ లో “తునివు” అనే ఏక్షన్ ఎంటర్టైనర్ సినిమా చేస్తుండగా తాను ఓ పక్క ఫామిలీ తో కూడా మంచి బిజీగా ఎక్కువ కాలం గడపడానికి ఇష్టపడతాడు. అయితే అజిత్ భార్య షాలిని కోసం చాలా మందికి తెలిసి కూడా ఉండచ్చు.

స్టార్ హీరో మాధవన్ బంపర్ హిట్ చిత్రం “సఖి” ఫేమ్ షాలిని అయితే లేటెస్ట్ గా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వడం ఆసక్తిగా మారింది. మరి షాలిని అయితే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఎంట్రీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరి షాలిని ఇంస్టా రాకతో కోలీవుడ్ వర్గాల్లో ఈ ఎంట్రీ వైరల్ గా మారింది.

మరి ఈమె రావడంతోనే ఇన్స్టా లో 24 గంటలు గడవక ముందే 21 వేలకి పైగా ఫాలోవర్స్ ని ఆమె సొంతం చేసుకోవడం విశేషం. దీనితో అజిత్ స్టార్ పవర్ ఇలా కూడా పని చేసింది అని చెప్పొచ్చు. 
https://www.instagram.com/shaliniajithkumarofficial/